ENGLISH

ఎన్టీఆర్ బ‌యోపిక్‌.. చక చకా చుట్టేస్తున్నారా?

05 December 2018-15:45 PM

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆఘ‌మేఘాల మీద రెడీ అవుతోంది. ప‌ది హేను రోజుల వ్య‌వ‌ధిలో రెండు భాగాల‌ను విడుద‌ల చేయ‌డం ఓ సాహ‌స‌మే. ఈనెల 15 లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. మ‌రోవైపు ఎన్నిక‌ల హ‌డావుడిలో నంద‌మూరి బాల‌కృష్ణ తెలంగాణ మొత్తం ప‌ర్య‌టిస్తున్నారు. ఈలోగా బాల‌య్య లేని స‌న్నివేశాల్ని చ‌క చకా పూర్తి చేస్తున్నాడు క్రిష్‌.

స‌న్నివేశాల్ని స్పీడుగా తీయ‌డంలో సిద్ద‌హ‌స్తుడు క్రిష్‌. అయిన‌ప్ప‌టికీ.. తీయాల్సిన స‌న్నివేశాలు ఇంకా చాలా ఉండ‌డంతో.. క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డ‌క త‌ప్ప‌డం లేద‌ని, కొన్ని స‌న్నివేశాలు మ‌రీ చుట్టేస్తున్నార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. టాకీ పూర్త‌యితే చాల‌దు.. రెండు పాట‌ల్ని కూడా పూర్తి చేయాల్సిఉంది. అందుకోసం `ఎన్టీఆర్‌` బృందం రెండు షిఫ్టుల‌లో ప‌నిచేస్తోందిప్పుడు.

మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. రెండు భాగాల్లోనూ క‌లిసి 11 పాట‌లుంటాయి. అందులో తొలిపాట ఇటీవ‌లే విడుద‌లైంది. ఈవారంలోనే మ‌రో గీతాన్నీ విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం.

ALSO READ: ఫోర్బ్స్ లిస్ట్ 2018: సంపాదనలో మహేష్ ని మించిన ఎన్టీఆర్..!