ENGLISH

NTR: ఆస్కార్ నెంబ‌ర్ వ‌న్ హీరో.. ఎన్టీఆర్!

14 March 2023-14:10 PM

యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ కి మ‌రో అరుదైన ఘ‌న‌త ద‌క్కింది. ఆస్కార్ వేడుక‌ల్లో భాగంగా సోష‌ల్ మీడియాలో అత్య‌ధిక‌సార్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన న‌టుల జాబితాలో ఎన్టీఆర్ నెంబర్ వ‌న్ స్థానంలో నిలిచాడు. ఆ త‌ర‌వాతి స్థానం రామ్ చ‌ర‌ణ్‌కి ద‌క్కింది. ఆస్కార్‌లో భాగంగా ఉత్త‌మ స‌హాయ న‌టుడు అవార్డు పొందిన కె.హ్యుయ్ ఖాన్‌, ఉత్త‌మ న‌టుడి పుర‌స్కార గ్ర‌హీత బ్రెండ‌న్ ప్రేజ‌ర్ లు సైతం ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల త‌ర‌వాతే నిల‌వ‌డం విశేషం.

 

ఈ గ‌ణాంకాల్ని సోష‌ల్ మీడియాని విశ్లేషించే నెట్ బేస్ క్విడ్ సంస్థ ప్ర‌క‌టించింది. దాంతో పాటుగా అత్య‌ధిక‌సార్లు ప్ర‌స్తావించిన చిత్రంగా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` నిలిచింది. ఆ త‌రువాతి స్థానం కూడా భార‌తీయ చిత్రానికే ద‌క్క‌డం విశేషం. ఉత్త‌మ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్ అవార్డు సాధించిన ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ రెండో స్థానంలో నిలిచింది. ఎక్కువ ఆస్కార్‌లు సాధించి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన `ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్‌` మూడో స్థానంలో ఉండిపోవ‌డం విశేషం. గ‌త ఆస్కార్‌ల‌తో పోలిస్తే.. ఈసారి ఆస్కార్ వ్యూవ‌ర్ షిప్ కూడా 12 శాతం పెరిగింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.