ENGLISH

కొర‌టాల స‌ల‌హా... చ‌మ‌టోడుస్తున్న ఎన్టీఆర్‌

21 May 2022-10:00 AM

ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `జ‌న‌తా గ్యారేజ్‌` సూప‌ర్ హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాపై అంచ‌నాలు బాగా పెరిగాయి. పైగా ఎన్టీఆర్ పిచ్చ ఫామ్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ప్రీ లుక్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది.

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కొత్త‌గా ఉండాల‌న్న‌ది కొర‌టాల తాప‌త్ర‌యం. అందుకే... ఎన్టీఆర్‌ని కాస్త బ‌రువు త‌గ్గ‌మ‌ని కొర‌టాల సూచించాడ‌ట‌. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం ఎన్టీఆర్ కాస్త బ‌రువు పెరిగాడు. ఆపాత్ర‌కు ఆ వెయిట్ స‌రిపోతుంది. కానీ... త‌న పాత్ర‌కు మాత్రం స్లిమ్ గా ఉండాల్సిందేన‌ని కొర‌టాల భావిస్తున్నాడు. అందుకే బ‌రువు త‌గ్గాల‌ని స‌ల‌హా ఇచ్చాడు. ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేయ‌డం ఎన్టీఆర్ కి అల‌వాటు. అందుకే.. జిమ్ లో చెమ‌టోడుస్తున్నాడు జూనియ‌ర్‌. క‌నీసం 8 నుంచి 10 కిలోలు త‌గ్గ‌డ‌మే ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకొన్నాడ‌ట‌. అంటే.. కొర‌టాల సినిమాలో కొత్త ఎన్టీఆర్‌ని చూడ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

ALSO READ: 'శేఖర్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్!