ENGLISH

ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా?

18 March 2021-10:00 AM

నాలుగు చేతులా సంపాదించ‌డం ఎలాగో ఈత‌రం హీరోల్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఓ వైపు సినిమాలు, మరోవైపు క‌మ‌ర్షియ‌ల్ యాడ్లూ, ఇంకోవైపు రియాలిటీ షోల‌తో... క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతూ.. కోట్లు ఆర్జిస్తున్నారు. ఈ జాబితాలో ఎన్టీఆర్ కూడా ఉంటాడు. టాలీవుడ్ లో అత్య‌ధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఎన్టీఆర్ ఒక‌డు. `బిగ్ బాస్`లాంటి రియాలిటీ షోలోనూ ద‌ర్శ‌న‌మిచ్చాడు. యాడ్లు స‌రే స‌రి.

 

ఇప్పుడు `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు` లో హోస్ట్ గా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్నాడు. మే నుంచి జెమినీ టీవీలో ఈ రియాలిటీ షో ప్ర‌సారం కానుంది. ఈ షో నిమిత్తం.. ఎన్టీఆర్ ఏకంగా 10 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడ‌ట‌. అంటే ఒక్కో ఎపిసోడ్ కీ 20 ల‌క్ష‌ల‌న్న‌మాట‌. ఈ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్లు ఉంటాయ‌ని, వారానికి 4 ఎపిసోడ్లు పూర్తి చేయ‌డానికి ఎన్టీఆర్ అంగీక‌రించాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఎనిమిది ఎపిసోడ్ల చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది.

ALSO READ: జాతిర‌త్నాలు... టార్గెట్ 40 కోట్లు