నటసింహం బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో తన చలనచిత్ర ప్రయాణంలో 100 చిత్రాల మైలురాయిని అందుకున్నాడు. ఇక అదే ఊపులో తన 101వ చిత్రమైన పైసా వసూల్ తో తనలోని కొత్త షేడ్ ని ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేశాడు.
పైసా వసూల్ చిత్రానికి వస్తే, హీరోలని డిఫరెంట్ గా చూపిస్తాడు అనే బ్రాండ్ ఉన్న పూరి జగన్నాధ్ తో బాలయ్య కలిసే సరికి ఈ చిత్రం పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా బాలయ్య చేసిన అభినయానికి ఫిదా అయ్యారు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన పలికిన పూరి మార్క్ డైలాగ్స్ అలాగే ఫుల్ ఎనర్జీ తో చేసిన నటన పైసా వసూల్ చిత్రానికే హైలైట్ అని చెప్పొచ్చు.
అయితే బాలయ్య పైనే పూర్తిగా ఈ చిత్రం ఆధారపడడం, కథలో కొత్తదనం లేకపోవడం పైసా వసూల్ చిత్రానికి పెద్ద మైనస్ గా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాలకృష్ణ తప్ప ఇంకేమిలేదు ఈ చిత్రంలో అనే అంతగా టాక్ రావడంతో ఈ చిత్ర రిజల్ట్ పైన ప్రభావం చూపుతుంది.
ఇక రైటర్ గా పూరి సక్సెస్ కొట్టినా దర్శకుడిగా మాత్రం ఒకే మూసలో కథలు రాస్తూ చిత్రాలు తీస్తున్నాడు అనే బ్యాడ్ ఇంప్రెషన్ మూటకట్టుకున్నాడు. మొదటిరోజు కలెక్షన్స్ కూడా యావరేజ్ గానే రావడం, ఓవర్సీస్ లో కూడా పెద్దగా ఓపెనింగ్స్ రాకపోవడం పైసా వసూల్ టీంని కొద్దిగా కలవరపరిచే విషయమే.
కాకపోతే లాంగ్ వీకెండ్ కావడంతో నాలుగు రోజుల తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎన్ని పైసలు వసూలు చేయనుందో అనే దాన్ని బట్టి పైసా వసూల్ రిజల్ట్ తేలిపోనుంది.
పైసా వసూల్ పరిస్థితి ఇలా వుంటే, అర్జున్ రెడ్డి మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతూ కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నది.
ALSO READ: అర్జున్ రెడ్డిని సినిమాని మీ కంప్యుటర్ లో చూడొచ్చు!