ENGLISH

Pakka Commercial: పక్కా కమర్షియల్ ది కూడా అదే దారి

29 June 2022-15:03 PM

మా సినిమాకి టికెట్ ధరలు తగ్గించేశాం అనేది ఇప్పుడు కొత్త ప్రమోషనల్ మార్గం. గోపి చంద్ మారుతి ‘పక్కా కమర్షియల్‌’ కూడా అదే రూటు లో వెళుతుంది.

 

ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించేశామని నిర్మాతలు చెబుతున్నారు. ''కొవిడ్‌ పరిస్థితుల వల్ల సినిమాని ఎనిమిది నెలలు ఆపుకోవాల్సి వచ్చింది. దాని వల్ల మాకు వడ్డీల భారం పెరిగిపోయింది. చిత్ర సీమలో కొవిడ్‌ తర్వాత పబ్లిసిటీ ఖర్చులు పెరిగాయి. వసూళ్లు తగ్గాయి. సినిమా స్థాయి, బడ్జెట్లను దృష్టిలో పెట్టుకునే టికెట్‌ ధరలు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చింది కదాని.. ఇష్టారీతిన ధరలు పెంచేస్తే పూర్తిగా దెబ్బతింటాం. మా ‘పక్కా కమర్షియల్‌’ చిత్ర విషయంలో టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా ఖరారు చేశాం.'' అని చెప్పుకొచ్చారు నిర్మాతలు

ALSO READ: `దిల్‌` ఖుష్‌... వార‌సుడొచ్చాడు