ENGLISH

Parusuram: స‌ర్కారు వారి సైడ్ ఎఫెక్ట్స్‌

20 July 2022-12:00 PM

'థ్యాంకూ' తర్వాత నాగచైనత్య , పరశురాం దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తారని అంతా భావించారు. సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో స్వయంగా పరశురాం చైతు సినిమాని ఖారారు చేశారు. స్క్రిప్ట్ మొత్తం పూర్తయిందని త్వరలోనే సెట్స్ పైకి వెళ్తామని చెప్పారు. ఈ చిత్రానికి `నాగేశ్వ‌ర‌రావు` అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

 

అయితే ఇప్పుడు నాగ చైతన్య మాటలు వింటుంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదని అర్ధమౌతుంది. థ్యాంకూ ప్రమోషన్స్ లో భాగంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడిన చైతు.. పరశురాం కథ ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి'' అని చెప్పుకొచ్చారు.

 

నాగచైతన్య లైన్ లో చాలా మంది దర్శకులు వున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు తో ఇటివలే ఒక సినిమాని ప్రకటించారు. శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రానికి నిర్మాత. చైతుకి ఈ కథ చాలా నచ్చింది. ముందు వెంకట్ ప్రభు సినిమానే సెట్స్ పైకి తీసుకెళ్లాలని చైతు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త‌రుణ్ భాస్క‌ర్ కూడా నాగ‌చైత‌న్య‌కు ఓ క‌థ వినిపించాడ‌ట‌. ఇప్పుడు చైతు మాటలు వింటుంటే పరశురాం సినిమా వెనక్కి వెళ్ళడం ఖరారైయింది. సర్కారు వారి పాట అనుకున్నంత విజయం సాధించకపోవడం కూడా కాంబినేషన్ పై ప్రభావం చూపించిదని ఇన్ సైడ్ టాక్.

ALSO READ: మైత్రీ మూవీ మేకర్స్ కి ఎదురుదెబ్బలు