ENGLISH

టెంప‌ర్ లాంటి క‌థ‌లో... ప‌వ‌ర్ స్టార్‌!

30 August 2020-10:00 AM

ఎన్టీఆర్ కెరీర్ లో మ‌రో మ‌ర్చిపోలేని చిత్రం.. `టెంప‌ర్‌`. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ, మేన‌రిజం.. ఇలా అన్నిట్లోనూ చెప్పుకోద‌గిన మార్పు చూపించిన సినిమా ఇది. క‌థ‌, క‌థ‌నాలు.. ముఖ్యంగా క్లైమాక్స్ ఇవ‌న్నీ బాగా ర‌క్తి క‌ట్టాయి. ఇలాంటి క‌థ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తే ఎలా ఉంటుంది? ఆ రేంజే వేరు క‌దూ. ఇప్పుడు అదే జ‌ర‌గ‌బోతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా - సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.

 

రామ్ తాళ్లూరి నిర్మాత‌. ఈ చిత్రానిక వ‌క్కంతం వంశీ క‌థ అందిస్తున్నారు. `టెంప‌ర్‌` సినిమా క‌థ‌.. వక్కంతం వంశీదే. కిక్‌, రేసుగుర్రం లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ఆయ‌న క‌థ అందించారు. ప‌వ‌న్ తో చేయ‌బోయే సినిమా `టెంప‌ర్‌`లాంటి క‌థ‌తో తెర‌కెక్కుతోంద‌ట‌. ఎంట‌ర్టైన్‌మెంట్, హీరోయిజం, మెసేజీ ఆ రేంజులో ఉంటాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్ చేతిలో ఉన్న వ‌కీల్ సాబ్ తో పాటు, క్రిష్ సినిమా పూర్త‌య్యాకే... సురేంద‌ర్ రెడ్డి సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

ALSO READ: అండ్ ద ఆస్కార్ గోస్ టూ.. మూవీ రివ్యూ!