ENGLISH

పవన్‌ కళ్యాణ్‌తో బండ్ల గణేష్‌.. వచ్చేస్తోంది.!

27 October 2020-17:00 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా బండ్ల గణేష్‌ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం విదితమే. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ తనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారంటూ ఉప్పొంగిపోతూ సోషల్‌ మీడియాలో ప్రకటించేశాడు బండ్ల గణేష్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘గబ్బర్‌సింగ్‌’ రావడం ఆ సినిమా సంచలన విజయం సాధించడం తెలిసిన విషయమే. పైగా, పవన్‌ కళ్యాణ్‌ అనే దేవుడికి తాను భక్తుడినని చెబుతుంటాడు బండ్ల గణేష్‌. కాగా, బండ్ల గణేష్‌ - పవన్‌ కళ్యాణ్‌కి కాంబోకి సంబంధించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

అయితే, ఇంతవరకు దర్శకుడు ఎవరన్నదానిపై బండ్ల గణేష్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, దీపావళికి ఈ కాంబినేషన్‌కి సంబంధించి క్లారిటీ రాబోతోందట. కథ దాదాపుగా ఓకే అయిపోయిందనీ, ఆ విషయాన్ని కూడా త్వరలోనే బండ్ల గణేష్‌ ప్రకటించబోతున్నాడనీ తెలుస్తోంది. పవన్‌ ప్రస్తుతం ‘వకీల్‌సాబ్‌’ సినిమాని ముందుగా పూర్తి చేయాల్సి వుంది. ఆ తర్వాత క్రిష్‌ డైరెక్షన్‌లో రూపొందుతోన్న సినిమా షూటింగ్‌కి అటెండ్‌ అవుతాడు.

 

హరీష్‌ శంకర్‌తో ఓ సినిమాకి పవన్‌ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం విదితమే. దాదాపు ఐదు సినిమాలు ఖాయమైపోగా, మరో రెండు సినిమాలు చర్చల దర్శలో వున్నాయి పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి. 2022 చివరి నాటికి ఆయా సినిమాల షూటింగులన్నీ పూర్తి చేసెయ్యాలనే ఆలోచనతో పవన్‌ వున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: హీరో శింబు కొత్త చిత్రం