ENGLISH

ప‌వ‌న్ - బోయ‌పాటి... కాంబో రెడీయేనా?

31 December 2021-12:30 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ జోరు చూస్తుంటే.. ఇండ్ర‌స్ట్రీలో ఉన్న ప్ర‌తీ దర్శ‌కుడికీ ఛాన్స్ ఇచ్చేసేలా క‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న ద‌గ్గ‌ర అర‌డ‌జ‌ను సినిమాలు ఉన్నాయి. అయినా స‌రే, కొత్త కొత్త ప్రాజెక్టులు ఒక‌దాని త‌ర‌వాత మ‌రోటి చేరుతూనే ఉన్నాయి. తాజాగా.... ప‌వ‌న్ లిస్టులోకి మ‌రో ద‌ర్శ‌కుడు చేరిపోయాడు. త‌నే... బోయ‌పాటి శ్రీ‌ను.

 

అఖండ సినిమాతో బోయపాటి మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేశాడు. ఈ సినిమా ఏకంగా రూ.125 కోట్లు సాధించింది. ఇప్ప‌టికీ కొన్నిఏరియాల్లో టికెట్లు బాగానే తెగుతున్నాయి. ఈ వారం కూడా అఖండ త‌న ప్ర‌తాపం చూపించొచ్చు. ఫైన‌ల్ ర‌న్ లో దాదాపుగా 150 కోట్లు తెచ్చుకుంటుంద‌ని ఓ అంచ‌నా. అంఖండ త‌ర‌వాత‌.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు బోయ‌పాటి. ఆ త‌ర‌వాత‌.. ప‌వ‌న్ ఓ సినిమా చేసే ఛాన్సుంద‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ప‌వ‌న్ - బోయ‌పాటి కాంబోని సెట్ చేయ‌డానికి ఓ అగ్ర నిర్మాత త‌హ‌త‌హ‌లాడిపోతున్నాడ‌ని, బోయ‌పాటి కూడా ప‌వ‌న్ తో సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడ‌ని టాక్‌. మెగా హీరోలు బోయ‌పాటికి బాగానే క‌లిసొచ్చారు. చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు బోయ‌పాటి. ఈలోగా ప‌వ‌న్ పిలిచి అవ‌కాశం ఇస్తే, బోయ‌పాటి ఎందుకు కాదంటాడు...?

ALSO READ: 2021 రివ్యూ: మాస్ మూవీ ఆఫ్ ది ఇయ‌ర్‌