ENGLISH

క‌థ‌లు రాస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

08 August 2020-10:39 AM

ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో.. తార‌లంతా కొత్త వ్యాప‌కాల‌తో బిజీ అవుతున్నారు. కొంత‌మంది వంటింట్లో దూరి ప్ర‌యోగాలు చేస్తే, ఇంకొంత‌మంది త‌మ హాబీల‌ను గుర్తు చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం.. ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని త‌న‌కు ఇష్టమైన రీతిలో గ‌డుపుతున్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్ అటు రాజ‌కీయాల ప‌రంగానూ, ఇటు సినిమాల ప‌రంగానూ బిజీనే. కాక‌పోతే.. సినిమాల‌కు అనుకోని బ్రేక్ రావ‌డం వ‌ల్ల కాస్త ఖాళీ స‌మ‌యం దొరికింది.


ఈ టైమ్ ని కూడా ప‌వ‌న్ సినిమాల కోస‌మే కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఖాళీ స‌మ‌యంలో ప‌వ‌న్ ఓ కొత్త క‌థ రాశాడ‌ట‌. జానీ త‌ర‌వాత‌.. ప‌వ‌న్ మ‌ళ్లీ పెన్ను ప‌ట్టుకోలేదు. కానీ ఇప్పుడు త‌న ఆలోచ‌న‌ల్ని కాగితం పై పెట్టి, ఓ క‌థ రాశాడ‌ని తెలుస్తోంది. అయితే ప‌వ‌న్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌ట‌. మ‌రొక‌రికి ఆ బాధ్య‌త అప్ప‌గిస్తాడ‌ని తెలుస్తోంది. కాక‌పోతే.. ప‌వ‌న్ చేతిలో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అవ‌న్నీ పూర్త‌యి, ప‌వ‌న్ క‌థ‌తో సినిమా రావ‌డానికి కాస్త టైమ్ ప‌డుతుంది.

ALSO READ: నితిన్ మైండ్ బ్లాక్ చేసిన న‌య‌న్