ENGLISH

ఇక్క‌డ ప‌వ‌న్‌.. అక్క‌డ కార్తీ!

28 August 2020-14:49 PM

మ‌ల‌యాళం సినిమాల‌పై ఇప్పుడు భార‌తీయ చిత్ర‌సీమ దృష్టి ప‌డింది. అక్క‌డి సూప‌ర్ హిట్లు... అన్ని భాష‌ల్లోనూ రీమేక్ అవుతున్నాయి. ప్రస్తుతం `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` క‌థ‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఈ సినిమాని తెలుగులో ప‌వ‌న్ తో రీమేక్ చేయాల‌న్న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. ప‌వ‌న్ తో పాటు.. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి కూడా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు ఇదే క‌థ‌.. త‌మిళంలోనూ రీమేక్‌కి సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో కార్తీ క‌థానాయ‌కుడిగా న‌టిస్తాడ‌ని తెలుస్తోంది.

 

కార్తితో పాటు సూర్య కూడా ఈ సినిమాలో న‌టించ‌బోతున్నాడ‌ని ముందు నుంచీ వార్త‌లొస్తున్నాయి. అయితే.. సూర్య ఈ సినిమా చేయ‌డం లేద‌ట‌. రెండో క‌థానాయ‌కుడిగా పార్తీబ‌న్ న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు ఒకేసారి తెర‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. త‌మిళ వెర్ష‌న్ కి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: శ్రీ‌మంతుడిపై 10 కేసులున్నాయ్‌!