ENGLISH

కాటమరాయుడు సెన్సార్ రిపోర్ట్

15 March 2017-18:32 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం రిలీజ్ కి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఇంతక్రితమే కాటమరాయుడు సెన్సార్ కూడా పూర్తీ చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు క్లీన్ ‘U’ సర్టిఫికేట్ ఇచ్చినట్టు సమాచారం. దీనితో కాటమరాయుడు సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిసిపోయింది.

ఇక కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవన్ 20 సంవత్సరాల ఇండస్ట్రీ సంబంధించి డబల్ ధమాకా జరుగబోతున్న సమయంలో ఈ న్యూస్ పవన్ ఫ్యాన్స్ కి ఐస్ క్రీం పైన స్పెషల్ చెర్రి లా మాంచి కిక్ ఇచ్చింది.