ENGLISH

ప్ర‌కాష్ రాజ్ కామెంట్ల‌పై స్పందించిన ప‌వ‌న్‌‌

05 April 2021-12:00 PM

ఇటీవ‌ల ప్ర‌కాష్ రాజ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా ప‌వ‌న్ రాజ‌కీయాల‌పై ఆయ‌న సెటైర్లు వేశారు. ప‌వ‌న్ వైఖ‌రిపై కొన్ని ఛాన‌ళ్ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో నిర్మొహ‌మాటంగా మాట్లాడారు. అయితే ప‌వ‌న్ ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం పై స్పందించారు. దీనికి `వ‌కీల్ సాబ్‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వేదిక అయ్యింది. `వ‌కీల్ సాబ్‌`లో ప్ర‌కాష్ రాజ్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న గురించి ప్ర‌స్తావిస్తూ... ఈ ఇష్యూనీ సున్నితంగా ట‌చ్ చేశాడు ప‌వ‌న్‌. ``ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్ కూడా న‌టించారు.

 

ఆయ‌న నాకు బాగా ఇష్ట‌మైన న‌టుడు. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి న‌టుడు ఉండ‌డం మ‌న అదృష్టం. ఆయ‌న ఉండ‌బ‌ట్టే.. నేను నా పాత్ర‌ని మ‌రింత బాగా చేశాను. ఎదురుగా ప్ర‌కాష్ రాజ్ లాంటి న‌టుడు ఉంటే... హీరోల పాత్ర‌లు ఇంకా బ‌లంగా పండుతాయి. ఆయ‌న‌కూ నాకూ రాజ‌కీయాల ప‌రంగా కొన్ని బేధాభిప్రాయ‌లు ఉండొచ్చు. నా గురించి కొన్ని ఇంట‌ర్వ్యూల‌లోనూ మాట్లాడారు. కానీ సినిమాల విష‌యానికొస్తే మేమంతా ఒక్క‌టే. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది`` అని చెప్పుకొచ్చాడు ప‌వ‌న్‌. త‌నే స్వ‌యంగా ఈ విష‌యంపై స్పందించ‌డంతో... ప్ర‌కాష్ రాజ్ వ్య‌వ‌హారం అంతా సద్దుమ‌ణిగిన‌ట్టైంది.

ALSO READ: వైల్డ్ డాగ్ కి చిరు కాంప్లిమెంట్స్