ENGLISH

Pawan Kalyan: ప‌వ‌న్ సినిమా.... అంతా సెట్‌!

14 July 2022-10:00 AM

ప‌వ‌న్ క‌ల్యాణ్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమా షూటింగ్ చాలా నెమ్మ‌దిగా సాగుతోంది. అయితే.. ఈ సినిమా చేతిలో ఉండ‌గానే, మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి ప‌వ‌న్ రెడీ అయిపోయాడు. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. ఇదో త‌మిళ చిత్రానికి రీమేక్‌. సాయి ధ‌ర‌మ్ తేజ్ సైతం ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. ఇప్పుడు ఈ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి ముహూర్తం రెడీ అయింద‌ని స‌మాచారం. ఈ నెలాఖ‌రున ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది.

 

ఎప్పుడైతే.. స‌ముద్ర‌ఖ‌నికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడో,

 

అప్పుడు హ‌రీష్ శంక‌ర్ హోప్స్ పూర్తిగా పోయిన‌ట్టే. ఎందుకంటే.. `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌` గా ప‌వ‌న్‌నిచూపించాల‌ని చాలా కాలం నుంచి హ‌రీష్ ఎదురు చూస్తున్నాడు. మైత్రీ మూవీస్ కూడా ప‌వ‌న్ కి ఎప్పుడో అడ్వాన్సు ఇచ్చింది. అయితే ఈ సినిమాకి గంప‌గుత్త‌గా కాల్షీట్లు కేటాయించాలి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఉన్న ప‌రిస్థితుల్లో అన్ని కాల్షీట్లు ఇవ్వ‌లేడు. అందుకే హ‌రీష్ సినిమా అంత‌కంత‌కీ ఆల‌స్యం అయిపోతోంది. అందుకే ఇప్పుడు హ‌రీష్ కూడా ప్ర‌త్యామ్నాయ ప్ర‌య‌త్నాలు మొదలెట్టేశాడు. సో.. ప‌వ‌న్ దారి ప‌వన్‌దే. హ‌రీష్ దారి హ‌రీష్ దే.

ALSO READ: Warrior: రామ్ 'వారియ‌ర్‌'కి ఎన్ని చిక్కులో?!