ENGLISH

కొత్త కొత్తగా 'కాటమరాయుడు'

07 March 2017-16:55 PM

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా కిషోర్‌ కుమార్‌ పార్ధసాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం'కాటమరాయుడు'. ఈ సినిమాని సీక్వెల్‌ అని అధికారికంగా ప్రకటించింది గతంలో శృతిహాసన్‌. ఈ సినిమాలో పవన్‌కి జోడీగా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తమిళ్‌ 'వీరమ్‌'కి ఈ సినిమా తెలుగు రీమేక్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా తెలుగులోకి 'వీరుడొక్కడే' పేరుతో విడుదలైపోయి, టీవీల్లో పదే పదే ప్రదర్శితమయిపోయింది కూడా. అలాంటి సినిమాని పవన్‌కళ్యాణ్‌ రీమేక్‌ చేయడం ఆశ్చర్యం కలిగింది. అయితే మొదట్లో ఇది రీమేక్‌ కాదు, అందులోని సోల్‌ని మాత్రమే తీసుకున్నామని చిత్ర యూనిట్‌ నుంచి స్పందన వచ్చింది. కానీ శృతిహాసన్‌ స్టేట్‌మెంట్‌తో ఇది పక్కా రీమేక్‌ అని తేలింది. అయితే ట్విస్ట్‌ ఏంటంటే ఇప్పుడు శృతిహాసన్‌ ఈ రీమేక్‌ వార్తల్ని ఖండించింది. పూర్తిగా కొత్తగా ఉంటుంది ఈ సినిమా అని చెబుతోంది ముద్దుగుమ్మ శృతిహాసన్‌. అంతేకాదు 'వీరం' సినిమా స్ఫూర్తితో మాత్రమే ఈ సినిమా రూపొందిందట. సన్నివేశాలన్నీ చాలా కొత్తగా ఉంటాయనీ, తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని చెప్పింది శృతిహాసన్‌. పక్కా రీమేక్‌ అయినా, స్ఫూర్తి పొందిన సినిమా అయినా ఇప్పటికే 'కాటమరాయుడు'కి రావాల్సిన హైప్‌ వచ్చేసింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్‌ కోసమే ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.