ENGLISH

కిరాత‌కుడితో.. డ్యూయెట్లు

22 June 2021-11:44 AM

ఆర్‌.ఎక్స్ 100తో ఒక్కసారిగా ఎగ‌సి ప‌డింది.. పయాల్ రాజ్ పుత్. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు, లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌కూ.. త‌నో మంచి ఆప్ష‌న్ అయ్యింది. ఒక‌టో రెండో ఐటెమ్ గీతాలూ చేసింది. 

 

అయితే ఆ హ‌డావుడి ఎక్కువ కాలం నిల‌బ‌డ‌లేదు. చ‌ప్పున చ‌ల్లారిపోయింది. ఆ త‌ర‌వాత ఆమెకు అవ‌కాశాలే క‌రువ‌య్యాయి. త్వ‌ర‌లో పాయల్ పెళ్లి చేసుకుంటుంద‌ని, సినిమాల‌కు దూరం అవుతుంద‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. దాంతో పాయాల్ చాప్ట‌ర్ క్లోజ్ అనే భావ‌న‌కు వ‌చ్చేశారు. అయితే ఎట్ట‌కేల‌కు త‌న‌కో అవ‌కాశం ద‌క్కింది. ఆది సాయి కుమార్ సినిమాలో క‌థానాయిక‌గా ఎంపికైంది. ఆది సాయికుమార్‌, వీర‌భ‌ద్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. దీనికి `కిరాత‌క‌` అనే పేరు ఖ‌రారు చేశారు. ఇందులో క‌థానాయిక‌గా పాయల్ ని ఎంచుకున్నారు. ఇదో క్రైమ్ థ్రిల్ల‌ర్‌. వీర‌భ‌ద్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ.. హాస్య భ‌రిత చిత్రాలే చేశాడు. తొలిసారి క్రైమ్ జోన‌ర్ ఎంచుకున్నాడు. త్వ‌ర‌లో షూటింగ్ మొద‌లుకానుంది.

ALSO READ: 'మా' అధ్యక్ష పోటీలో మంచు విష్ణు