ENGLISH

ఆమె లేకపోతే 'ఆర్‌ ఎక్స్‌ 100' లేదా?

19 July 2018-10:45 AM

'ఆర్‌ ఎక్స్‌ 100' ఇప్పుడీ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో మార్మోగిపోతోందీ పేరు. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి, టాప్‌ లేపేస్తోంది. ఏ కారణంగా ఈ సినిమా ఇంత విజయం అందుకుందో తెలీదు కానీ, ఈ సినిమాకి పెద్దగా పోజిటివ్‌ రివ్యూలు కూడా వచ్చింది లేదు. కానీ వసూళ్లు మాత్రం కొల్లగొట్టేస్తోంది. 

దీనికంతటికీ కారణం హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌నేనట. ఈ విషయాన్ని నెటిజన్లే కన్‌ఫామ్‌ చేసేశారు. 'నువ్వు లేకపోతే 'ఆర్‌ఎక్స్‌100' లేదు అని పొగిడేస్తుండడంతో, ఈ హాట్‌ భామ పొంగిపోతోందట. వారందరికీ సోషల్‌ మీడియాలో హార్ట్‌ఫుల్‌గా థాంక్స్‌ చెప్పేసుకుంటోంది పాయల్‌ రాజ్‌పుత్‌. సినిమాలో అమ్మడి హాట్‌ ప్రదర్శనకు ఆకాశమే హద్దు అన్న సంగతి సినిమా చూడని వాళ్లకు కూడా ప్రోమోస్‌తో తెలిసిపోయింది. ఇక సినిమా చూసిన వారి సంగతి చెప్పనే అక్కర్లేదు కదా. ఓ 

సారి చూసిన వారు వన్స్‌ మోర్‌ అంటూ మళ్లీ మళ్లీ ధియేటర్స్‌కి పరుగులు పెడుతున్నారట. ఎందుకయ్యా అంటే కేవలం హీరోయిన్‌ గ్లామర్‌ కోసమే. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో ఏ హీరోయిన్‌ అందాల ఆరబోత చేయలేదనే చెప్పాలి. అందుకే యూత్‌ ఈ సినిమాకి బాగా కనెక్ట్‌ అయిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్‌ పాత్రకే. 

ఇకపోతే హీరో కార్తికేయ కూడా రగ్గ్‌డ్‌ లుక్‌తో రొమాంటిక్‌ సీన్స్‌లో ఇరగదీసేశాడు. అలా ఇప్పుడు 'ఆర్‌ఎక్స్‌100'కి తిరుగే లేకుండా పోయింది. ఈ స్థాయిలో చెప్పుకోదగ్గ మరో సినిమా కూడా లేకపోవడంతో 'ఆర్‌ఎక్స్‌100' పంట పండిపోతుందంతే.

 

ALSO READ: Hot Gallery of Payal Rajput