ENGLISH

పాపం.. పాయ‌ల్ చాలా బాధ ప‌డిపోతోంది

11 November 2021-14:00 PM

ఆర్‌.ఎక్స్ 100తో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది పాయ‌ల్‌. అందులో త‌న ఒంపు సొంపుల‌తో అద‌రొట్టేసింది. బోల్డ్ స‌న్నివేశాల్లో తాను న‌టించిన తీరు చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. దాంతో ఓ అర‌డ‌జ‌ను సినిమాల్ని త‌న ఖాతాలో వేసుకోగ‌లిగింది. కానీ.. ఒక్క‌టీ స‌రిగా ఆడ‌లేదు. ఆర్‌.ఎక్స్ 100 ద‌రి దాపుల్లోకి కూడా మ‌రో సినిమావెళ్ల‌లేక‌పోయింది. దాంతో పాయ‌ల్ చాలా నిరాశ ప‌డిపోయింది. అయితే ఆర్‌.ఎక్స్ 100ని హిందీలోరీమేక్ చేశారు. అందులో పాయ‌ల్ స్థానంలో తారా అనే క‌థానాయిక న‌టించింది.

 

ఆర్‌.ఎక్స్ 100 రీమేక్ లో త‌న‌ని తీసుకోక‌పోవ‌డం చాలా బాధించింద‌ని పాయ‌ల్ చెబుతోంది. ``హిందీ వెర్ష‌న్ కోసం నా పేరు ప‌రిశీలిస్తార‌ని పించింది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. కానీ తార కూడా బాగా చేసింది. ట్రైల‌ర్ల‌లో త‌న పెర్‌ఫార్మ్సెన్స్ నాకు న‌చ్చింది. సినిమా చూడాల‌న్న కోరిక మ‌రింత బ‌లంగా క‌లిగింద‌``ని చెప్పుకొచ్చింది. ఆర్‌.ఎక్స్100 ని హిందీలో త‌డ‌ప్ అనే పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సునీల్ శెట్టి త‌న‌యుడు ఆహాన్ శెట్టి ఈ సినిమాతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త్వ‌ర‌లోనే ఈచిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

ALSO READ: Payal Rajput Hot Photoshoot