ENGLISH

ఫామ్ హౌస్‌లో పేకాట‌... చిక్కుల్లో ప‌డ్డ యువ హీరో

01 November 2021-12:00 PM

హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ ఫామ్ హౌస్ లో పేకాట దందా జోరుగా సాగుతున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. పేకాట స్థావ‌రాల‌పై పోలీసులు దాడి చేయ‌డం, వాళ్ల‌ని ప‌ట్టుకోవ‌డం మామూలే. అయితే.. ఈసారి ఈ స్థావ‌రం ఓ హీరోద‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం.

 

హైద‌రాబాద్ శివార్ల‌లో ఆదివారం రాత్రి ఓ పేకాట స్థావ‌రంపై పోలీసులు దాడ‌ది చేశారు. అక్క‌డ దాదాపు 30 ల‌క్ష‌ల న‌గ‌దుని స్వాధీనం చేసుకున్నారు. కొంత‌మంది మాజీ ఎం.ఎల్‌.ఏలు కూడా ప‌ట్టుబడ్డారు. అక్క‌డ ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ రీతిలో పేకాట ఆడిస్తున్నార‌ని, గోవాలో కాసినోని త‌ల‌పించేలా వాతావ‌ర‌ణం ఉంద‌ని పోలీసులు గుర్తించారు. అంతే కాదు.. ఈ ఫామ్ హౌస్ ఓ యువ హీరోద‌ని తేలింది. ఆ యువ హీరో ఎవ‌రో కాదు. నాగశౌర్య‌. అయితే త‌న ఫామ్ హౌస్ లో పేకాట ఆడిస్తున్నార‌న్న సంగ‌తి నాగ‌శౌర్య‌కు తెలుసా? లేదా? నాగ‌శౌర్య పేరు చెప్పి ఎవ‌రైనా ఈ దందా న‌డుపుతున్నారా? అనేది పోలీసులు చేధించాల్సిన విష‌యాలు. ఒక‌వేళ ఈ దందా వెనుక శౌర్య ఉన్నాడ‌ని తెలిస్తే మాత్రం ఈ యువ హీరో చిక్కుల్లో ప‌డిన‌ట్టే.

ALSO READ: ఇంటికి తిరిగొచ్చిన ర‌జ‌నీ.. ఫ్యాన్స్ హ్యాపీ