ENGLISH

‘అది’ చూపించి క్యాష్‌ చేసుకుంటే తప్పులేదా?

07 November 2020-16:00 PM

కొన్నాళ్ళ క్రితం హీరోయిన్‌ తాప్సీ సౌత్‌ సినిమాలపై సంచలన ఆరోపణలు చేసింది. ‘బొడ్డు మీద కొబ్బరికాయ పగలగొట్టడంలో సెక్సప్పీల్‌ ఏముంటుందో నాకు అర్థం కాలేదు.. సౌత్‌లో నాకు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎక్కువగా దక్కలేదు.. నన్ను కేవలం గ్లామరస్‌ డాల్‌లానే చూశారు అక్కడ..’ అంటూ వ్యాఖ్యానించి వివాదాల్లోకెక్కింది తాప్సీ. ‘నా ఉద్దేశ్యం అది కాదు..’ అంటూ ఆ తర్వాత ఆమె డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం వివరణ ఇచ్చింది. అది వేరే వ్యవహారం. ఇక, ఇప్పుడు హీరోయిన్‌ పూజా హెగ్దే కూడా దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేసింది.

 

‘సౌత్‌లో నావెల్‌ అబ్సెషన్‌ ఎక్కువ..’ అంటూ వెటకారం చేసింది. అంటే, ఆమె బొడ్డు చూసి మాయలో పడిపోతున్నారట ప్రేక్షకులు. తన కాళ్ళ మీద ఎక్కువ ఫోకస్‌ చెయ్యడం కూడా ఇబ్బందికరంగా వుందంటూ పూజా హెగ్దే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. అంత ఇబ్బందికరంగా వుంటే, సినిమాలెందుకు చెయ్యడం.? ‘నాకు ఇబ్బందికరం’ అంటూ దర్శక నిర్మాతలకు తెగేసి చెప్పొచ్చు కదా.! ‘అది చూపించి’ అవకాశాలు కొల్లగొట్టడం హీరోయిన్లుకు కొత్తేమీ కాదు.. ఆ తర్వాత ఆ విషయమ్మీదనే విమర్శలు చేయడమూ వారికి అలవాటే.

 

అప్పుడు తాప్సీ, ఇప్పుడు పూజా హెగ్దే.. అంతే తేడా. మరీ ముఖ్యంగా సౌత్‌ సినిమాలంటే ఈ ముద్దుగుమ్మలకి ఇంత చులకన ఎందుకో.! దర్శక నిర్మాతలూ ఒకింత హీరోయిన్ల తీరుని ఓ కంట కనిపెట్టండి. తెలుగు సినిమా పరువుని కాపాడండి.!

ALSO READ: ఎన్టీఆర్ కోసం త్రివిక్ర‌మ్ చేసిన త్యాగం