ENGLISH

బుట్టబొమ్మ కవరింగ్‌.. కుదిరిందా? లేదా?

10 November 2020-13:00 PM

‘సౌత్‌ సినీ జనాలకి బొడ్డు చుట్టూనే అంత ఆసక్తి ఎందుకో..’ అంటూ హీరోయిన్‌ పూజా హెగ్దే చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం విదితమే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎట్టకేలకు పూజా హెగ్దే వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘నా ఉద్దేశ్యం అది కాదు..’ అంటూ కవరింగ్‌ బాగానే చేసుకుందిగానీ, సౌత్‌ సినిమాల మీద గట్టిగా సంపాదించి, అంతే గట్టిగా వెన్నుపోటు కూడా పొడిచిందంటూ ఆమె మీద సెటైర్లు మాత్రం ఆగలేదు. సౌత్‌ సినిమాలు కాదు, ఇక్కడ మేటర్‌ డైరెక్ట్‌గా తెలుగు సినిమాల గురించే.

 

హీరోయిన్‌ అంటేనే గ్లామర్‌.. ఆ గ్లామర్‌ విషయంలో హీరోయిన్‌ బొడ్డుకి వున్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పేదేముంది.? పూజా హెగ్దే నడుము పార్ట్‌ని ఫోకస్‌ చేస్తూ చాలా సినిమాల్లో దర్శకులు చాలా చాలా అందమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ పార్ట్‌ అంత అందంగా వుంటుంది కాబట్టే, పూజా హెగ్దేకి అవకాశాలూ వెల్లువలా వచ్చిపడుతున్నాయనేదీ నిర్వివాదాంశం. తెలుగు సినిమాల్లోనేనా.? దక్షిణాది సినిమాల్లోనేనా.? బాలీవుడ్‌లో కూడా అదే ట్రెండ్‌ నడుస్తోంది కదా.!

 

కానీ, పూజా హెగ్దే ఎందుకు టాలీవుడ్‌ పట్ల ఇంత నిర్లక్ష్యపూరితమైన వ్యాఖ్యలు చేసిందట.! ‘నా ఉద్దేశ్యం వేరు, వేరే కాంటెక్స్‌ట్‌లో చేసిన వ్యాఖ్యలవి..’ అని పూజ ఎంత కవరింగ్‌ చేసుకుంటున్నా, ఆమె ఉద్దేశ్యమైతే సుస్పష్టమైపోయింది. ‘నాకు తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో మంచి చోటు దక్కింది..’ అని పూజ చెప్పుకుంటే సరిపోదు, ఆ గౌరవాన్ని ఆమె నిలబెట్టుకోవాలి కూడా!

ALSO READ: Pooja Hegde Latest Photoshoot