ENGLISH

Ravi Teja: ఎన్నాళ్లెకెన్నాళ్ల‌కి.. ర‌వితేజ సినిమాకి పాజిటీవ్ బ‌జ్‌!

28 July 2022-11:00 AM

ర‌వితేజకి వ‌రుస‌గా అన్నీ ఫ్లాపులే. `క్రాక్‌`కి ముందూ.. ఆ త‌ర‌వాత‌.. వ‌రుస ప‌రాజ‌యాల్ని ఎదుర్కొన్నాడు ర‌వితేజ‌. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` లాంటి సినిమాలైతే పూర్తిగా వాష్ అవుట్ అయిపోయాయి. దాదాపుగా ప్ర‌తీ సినిమాకీ నెటిటీవ్ బ‌జ్జే క‌నిపించేది. `సినిమా బాగా రాలేద‌ట‌.. పోయింద‌ట‌` అనే వార్త‌లు ముందే బ‌య‌ట‌కు వ‌చ్చేసేవి. వాటికి త‌గ్గ‌ట్టుగానే ఫ‌లితం క‌నిపించేది. అయితే చాలా కాలం త‌ర‌వాత తొలిసారి రవితేజ సినిమాకి పాజిటీవ్ బ‌జ్ వినిపిస్తోంది.

 

ర‌వితేజ హీరోగా న‌టించిన సినిమా `రామారావు ఆన్ డ్యూటీ`. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడు. ఈ వారంలోనే విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాపై ఇప్పుడు పాజిటీవ్ బ‌జ్ న‌డుస్తోంది. సినిమా బాగా వ‌చ్చింద‌ని, ఈమ‌ధ్య వ‌చ్చిన ర‌వితేజ సినిమాల్లో ఇదే బెస్ట‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

ర‌వితేజ సినిమాకి ఈమాత్రం బ‌జ్ రావ‌డం, పైగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అంటే గొప్ప విష‌య‌మే అనుకోవాలి. నిజానికి ఈ సినిమాపై కూడా ముందు నెగిటీవ్ కామెంట్లు వినిపించాయి. అవి క్ర‌మంగా త‌గ్గి, సినిమా ఇప్పుడు పాజిటీవ్ నోట్ తో విడుదల అవుతుండ‌డం విశేషం, మ‌రి అంతిమ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

ALSO READ: Sita Ramam: సీతారామం.. రామాయణమేనా ?