ENGLISH

ప్ర‌భాస్ ని మ‌ళ్లీ ప‌డ‌గొట్టేశాడు

24 March 2021-11:00 AM

కేజీఎఫ్‌తో క‌ల‌క‌లం సృష్టించాడు ప్ర‌శాంత్ నీల్. ఈ ఒక్క సినిమాతో... బ‌డా హీరోల దృష్టి ప్ర‌శాంత్ పై ప‌డింది. ఇప్పుడు ప్ర‌భాస్ తో `స‌లార్‌` సినిమా చేస్తున్నాడు ప్ర‌శాంత్. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే... మ‌రోసారి ప్ర‌భాస్ తో ప‌నిచేసే ఛాన్స్ కొట్టేసిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. దిల్ రాజు సంస్థ‌లో ఓ సినిమా చేయ‌డానికి ప్ర‌భాస్ అంగీకారం తెలిపాడు. `మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్` త‌ర‌వాత ఆ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ సినిమా చేయ‌డం ఇదే తొలిసారి.

 

ఈసినిమాకి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌న్న టాక్ వినిపిస్తోంది. ప్ర‌భాస్ సినిమా అవ్వ‌గానే.. ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ చేయాలి ప్ర‌శాంత్ నీల్. ఆ త‌ర‌వాత‌... అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమాఉంటుంద‌ని టాక్‌. ఈలోగా ప్ర‌భాస్‌.... `ఆదిపురుష్‌`తో పాటుగా... నాగ అశ్విన్ సినిమాల్ని పూర్తి చేస్తాడు. ఆ త‌ర‌వాతే... ఈ కాంబోలో సినిమా ప‌ట్టాలెక్కుతుంది. `స‌లార్‌` సెట్స్‌పై ఉండ‌గానే ప్ర‌శాంత్ నీల్ తో మ‌రో సినిమా చేయ‌డానికి ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడంటే... ప్ర‌శాంత్ నీల్ ప‌నిత‌నం ఏమిటో అర్థం చేసుకోవొచ్చు.

ALSO READ: ఎన్టీఆర్ పిలిచినా.... బుచ్చిబాబు రెడీ గా లేడా?