ENGLISH

అనుష్క‌తో ప్ర‌భాస్ పెళ్లి... మేట‌ర్ క్లియ‌ర్‌!

10 March 2022-11:00 AM

ప్ర‌భాస్ పెళ్లెప్పుడు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇదిగో.. అదిగో అంటున్నారు త‌ప్ప‌, ఎవ‌రూ క్లారిటీగా చెప్ప‌డం లేదు. `ఈ యేడాది ప్ర‌భాస్ పెళ్లి చేసేస్తా` అని పెద‌నాన్న కృష్ణంరాజు కూడా చాలాసార్లు చెప్పారు. కానీ... ప్ర‌తీ యేడూ అదే మాట రిపీట్ అవుతోంది త‌ప్ప‌, ప్ర‌భాస్ పెళ్లి మాట‌. అలా నానుతూనే ఉంది.

 

ప్ర‌భాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడొచ్చినా, అందులో అనుష్క కూడా ఇన్వాల్వ్ అవుతుంటుంది. ప్ర‌భాస్ కీ అనుష్క‌కీ మ‌ధ్య ఏదో ఉంద‌ని, ఇద్ద‌రూ ప్రేమించుకున్నార‌ని, పెళ్లి కూడా చేసేసుకుంటార‌ని లెక్క‌లేన‌న్ని గాసిప్పులు వ‌చ్చాయి. వీటిపై ప్ర‌భాస్‌, అనుష్క ఎప్పుడూ నేరుగా స్పందించ‌లేదు. అయితే కృష్ణంరాజు భార్య శ్యామ‌లా దేవి ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చారు.

 

ప్రభాస్ - అనుష్క ఇద్ద‌రూ స్నేహితులే అని, వారిద్ద‌రికీ అలాంటి ఆలోచ‌న‌లు లేవ‌ని, వారిద్ద‌రీ పెళ్లి జ‌ర‌గ‌నే జ‌ర‌గ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ప్ర‌భాస్ ఎవ‌రిని ప్రేమించినా, ఎవ‌రిని పెళ్లి చేసుకుంటాన‌న్నా త‌మ మ‌ద్ద‌తు పూర్తిగా ఉంటుంద‌ని చెప్పారు. ప్ర‌భాస్‌కి కుటుంబం, సంస్క్రృతి, సంప్ర‌దాయాలు అంటే ఇష్ట‌మ‌ని, అలాంటి వాటికి గౌర‌వం ఇచ్చే అమ్మాయినే పెళ్లి చేసుకుంటార‌ని హింట్ ఇచ్చారు.

ALSO READ: ఆర్‌.ఆర్‌.ఆర్ టార్గెట్ రూ.800 కోట్లు