ENGLISH

భైరవ గా ప్రభాస్.. ఎంట్రీ అదుర్స్

09 March 2024-17:27 PM

ప్రభాస్‌ కథానాయకుడిగా... నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’.  దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పఠానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహా శివరాత్రిని  పురస్కరించుకుంటూ ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను 'భైరవ'గా పరిచయం చేశారు. మజిల్ద్ బాడీతో ఫ్యూచరిస్టిక్ గెటప్ లో సాలిడ్ గా కనిపించారు ప్రభాస్.


పురాణాల స్ఫూర్తితో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నాగ్‌ అశ్విన్‌. ప్రస్తుతం ఈ సినిమా ఇటలీలో ఓ పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. వైజయంతీ మూవీస్‌ సంస్థకి బాగా కలిసొచ్చిన మే9న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఆ సంస్థ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’, ‘మహర్షి' సినిమాలు అదే డేట్ కి మంచి విజయాలని సాధించిన సంగతి తెలిసిందే.