ENGLISH

బకా - ప్రభాస్ కొత్త చిత్రం పై భారీ అంచనాలు..!

12 March 2025-15:59 PM

సినిమా టైటిల్ కూడా కథకు తగిన విధంగా ఉండాలనే కసితో దర్శక నిర్మాతలు వినూత్నమైన పేర్లను ఎంచుకుంటున్నారు. తాజాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ మైథలాజికల్ మూవీ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘బకా’ (BAKA) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకుడు మరెవరో కాదు, ‘హనుమాన్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా, మహాభారతంలోని బకాసురుడి ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనుందని టాక్. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ కథకు అనుగుణంగా ‘బకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన మైథలాజికల్ మూవీలకు పూర్తిగా భిన్నంగా ఉండే ఈ సినిమా అత్యంత గ్రాండ్‌గా రూపొందనుందని సినీ వర్గాలు అంచనా.

ఇదివరకే ప్రశాంత్ వర్మ.. రణవీర్ సింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసినప్పుడు, దీనికి ‘బ్రహ్మ రాక్షస’ అనే టైటిల్ అనుకున్నారని, కానీ ఇప్పుడు ప్రభాస్ ఎంట్రీతో టైటిల్‌ను ‘బకా’గా మార్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ అప్డేట్‌తో ఉత్సాహంగా ఉన్నారు!

ALSO READ: ఎన్టీఆర్ - నెల్సన్ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్!