ENGLISH

ఫేస్ బుక్ కింగ్.. ప్ర‌భాస్‌

02 August 2021-16:00 PM

బాహుబ‌లితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దేశ‌మంతా ప్ర‌భాస్ కి అభిమానులు త‌యార‌య్యారు. విదేశాల్లోనూ త‌న ప్ర‌తాపం చూపిస్తున్నాడు. అందుకే ప్ర‌భాస్ పేరు మార్మోగిపోతోంది. సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్ అభిమాన సంఘాల ఖాతాల‌కైతే లెక్క‌లేదు. వ్య‌క్తిగ‌తంగా ప్ర‌భాస్ ఫాలోవ‌ర్లు 24 మిలియ‌న్‌ల‌కు పైనే. దేశ వ్యాప్తంగా ఫేస్ బుక్ లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న సెల‌బ్రెటీల జాబితాలో ప్ర‌భాస్ 9వ స్థానంలో ఉన్నాడు. సౌత్ ఇండియాలో ఈ జాబితాలో స్థానం ద‌క్కించుకున్న ఏకైన స్టార్ ప్ర‌భాస్ మాత్ర‌మే.

 

టాప్ 1 పొజీష‌న్‌లో స‌ల్మాన్ ఖాన్ (50.7 మిలియ‌న్‌) ఉంటే ఆ త‌ర‌వాత వ‌రుస‌గా అక్ష‌య్ కుమార్‌, షారుఖ్ ఖాన్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌పిల్ శ‌ర్మ‌, హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ‌క్, అజ‌య్‌దేవ‌గ‌న్ ఉన్నారు. ప్ర‌భాస్ త‌రువాతి స్థానంలో షాహిద్ క‌పూర్ ఉన్నాడు. నిజానికి ప్ర‌తీ హీరోకి సోష‌ల్ మీడియా టీమ్ ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలోఅప్ ల‌తో.. ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డుతూనే ఉంటారు. కానీ ప్ర‌భాస్ వీటిపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌డు. అయినా స‌రే.. టాప్ 9 లో ఉన్నాడంటే, కాస్త శ్ర‌ద్ధ పెట్టినా.. టాప్ 1లోకి చేరిపోవ‌డం ఖాయం.

ALSO READ: ర‌మ్య‌కృష్ణ‌ని తీసేశారు... ఆ ప్లేస్ లో ఎవ‌రంటే?