ENGLISH

మ‌హాభార‌త గాథ‌లో... ప్ర‌భాస్?

07 August 2020-17:48 PM

బాహుబ‌లి త‌ర‌వాత ప్ర‌భాస్ రేంజ్ పెరిగింది. ప్ర‌భాస్ ఏం సినిమా చేసినా అది పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటోంది. సాహో కూడా పాన్ ఇండియా సినిమానే. ఇప్పుడు.. `రాధే శ్యామ్‌` కూడా అన్ని భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌భాస్ - నాగ అశ్విన్ త‌ర‌వాత‌.. ప్ర‌భాస్ మ‌రో సినిమా చేయబోతున్నాడు. ఈసారి నేరుగా బాలీవుడ్ కి ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇదో మ‌ల్టీస్టార‌ర్ సినిమా అనీ, ఇందులో హృతిక్ రోష‌న్ కూడా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా మ‌హాభార‌త క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోంద‌ట‌. 


మ‌హాభార‌తం అంటే పెద్ద సెట‌ప్‌. యుద్ధాలు, భారీ సెట్లూ ఉంటాయి. బాహుబ‌లి త‌ర‌వాత‌.. యుద్ధ నేప‌థ్యంలో ఉన్న క‌థ‌ని ఎంచుకోలేదు ప్ర‌భాస్‌. ఇది కూడా రెండు మూడేళ్లు ప‌ట్టే భారీ ప్రాజెక్టు అని తెలుస్తోంది. హృతిక్ రోష‌న్ తో పాటు.. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు బాలీవుడ్ హీరోలు ఈ సినిమాలో క‌నిపిస్తార‌ని బాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అన్న‌ట్టు నాగ అశ్విన్ సినిమాలోనూ యుద్ధ నేప‌థ్యం ఉంటుంద‌ని తెలుస్తోంది. మొత్తానికి బాహుబ‌లి త‌ర‌వాత కూడా ప్ర‌భాస్ ని యుద్ధాలు వ‌ద‌ల‌డం లేద‌న్న‌మాట‌.

ALSO READ: Prabhas And Hrithik Roshan To Act In Mahabharata?