ENGLISH

ప్ర‌భాస్ తో 'మైత్రీ' కుదిరింది

21 December 2020-16:25 PM

ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌. త‌న‌తో సినిమా చేయాల‌ని... ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ క్యూ క‌ట్టేస్తున్నారు. ప్ర‌భాస్ తో సినిమా అంటే ఇప్పుడు 300 కోట్ల‌కు పైమాటే. అయినా సరే, ఎవ్వ‌రూ త‌గ్గ‌డం లేదు. తాజాగా మైత్రీ మూవీస్ సంస్థ ప్ర‌భాస్ తో ఓ సినిమా చేయ‌డానికి ఫిక్స్ అయ్యింది. నిజానికి మైత్రీతో ప్ర‌భాస్ ఎప్పుడో సినిమా చేయాల్సింది. కానీ ఇంత వ‌ర‌కూ కుర‌ర్లేదు. ఈసారి ఎలాగైనా స‌రే, ప్ర‌భాస్ తో సినిమా చేయాల్సిందే అని... మైత్రీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింది. ఎట్ట‌కేల‌కు ప్ర‌భాస్ కూడా ఓకే అనేశాడ‌ట‌.

 

కాక‌పోతే... ద‌ర్శ‌కుడు, క‌థ కావాలి. మైత్రీ ఇప్ప‌టికే చాలామంది ద‌ర్శ‌కుల‌కు అడ్వాన్సులు ఇచ్చింది. వాళ్లంతా ప్ర‌భాస్ కోసం క‌థ సిద్ధం చేసే ప‌నిలో ఉన్నారు. మ‌రి ముందు ఎవ‌రు క‌థ చెబుతారో, ఏంటో? దాంతో పాటు... ప్ర‌భాస్ ఏమాత్రం ఖాళీగా లేడు. ప్ర‌భాస్ కోసం మైత్రీ మూవీస్ మ‌రో రెండు మూడేళ్ల పాటు ఎదురు చూడాల్సిందే.

ALSO READ: సోనూసూద్ విగ్ర‌హం వెల‌సింది