ENGLISH

ప్రేమికుల రోజున‌... ప్ర‌భాస్ గిఫ్ట్

02 February 2021-13:00 PM

రాధే శ్యామ్ అప్ డేట్ కోసం.. ప్ర‌భాస్ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాది వేస‌విలో విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం. అయితే.. రిలీజ్ డేట్ మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. మిగిలిన సినిమాల‌న్నీ రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించేసినా... రాధే శ్యామ్ నుంచి మాత్రం ఎలాంటి స‌మాచారం రాలేదు. అస‌లు ఈ సినిమా టీజ‌రే ఇప్ప‌టి వ‌ర‌కూ చూళ్లేదు.

 

ఈ సంక్రాంతికి టీజ‌ర్ వ‌స్తుంద‌ని ఆశించారంతా. కానీ... టీజ‌ర్ రాలేదు. అయితే ఫిబ్ర‌వ‌రి 14న మాత్రం టీజ‌ర్ ప‌క్కా అని స‌మాచారం. ఇప్ప‌టికే టీజ‌ర్ రెడీ అయ్యింద‌ని, అయితే ఆ టీజ‌ర్ చూసిన ప్ర‌భాస్ కొన్ని మార్పులు చెప్పాడ‌ని, ఆ మార్పుల‌న్నీ చేసి, ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. రాధే శ్యామ్ ఓ సంపూర్ఱ‌మైన ప్రేమ‌క‌థ‌. కాబ‌ట్టి... ప్రేమికుల రోజునే విడుద‌ల చేయ‌డం క‌రెక్ట్ అని టీమ్ ఫిక్స‌య్యింద‌ట‌. అంటే... అప్ప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

ALSO READ: ప‌వ‌న్ కోసం మ‌రో క్రేజీ టైటిల్