ENGLISH

ప్ర‌భాస్ సినిమాకి ఊహించ‌ని ఎదురు దెబ్బ‌

30 October 2020-09:36 AM

దాదాపు 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన సినిమా `సాహో`. థియేట‌ర్లో ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. అయితే ప్ర‌భాస్ అభిమానుల‌కు మాత్రం బాగా న‌చ్చింది. యాక్ష‌న్ సీన్లు, ప్ర‌భాస్ హీ మాన్ సాహ‌సాలకు అభిమానులు ఫిదా అయ్యారు. హిందీలో ఈ సినిమా సూప‌ర్ హిట్టే.

 

కానీ.. శాటిలైట్ ప‌రంగా మాత్రం నిరాశ ఎదురైంది. ఈ సినిమాని ఇటీవ‌ల జీలో ప్ర‌దర్శించారు. వ‌చ్చిన రేటింగులు చూసి యాజ‌మాన్యం నిర్ఘాంత పోయింది. ఎందుకంటే.. క‌నీసం 6 రేటింగ్ కూడా ఈసినిమాకి రాలేదు. జీ టీవీ వాళ్లు ఈ సినిమా శాటిలైట్ పై భారీగా ఖ‌ర్చు పెట్టారు. కోట్లు పోసి కొన్న సినిమాకి రేటింగులు రాక‌పోవ‌డం ఎవ‌రికైనా బాధే. పైగా మొద‌టి సారి ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడు రికార్డుల‌న్నీ బ్రేక్ అవుతాయ‌ని భావిస్తారు. కానీ.. అలాంటిదేం జ‌ర‌గ‌క్క‌పోగా, అత్య‌ల్ప రికార్డు మూట‌గ‌ట్టుకుంది.

 

అయితే.. ఈసినిమాని ఓటీటీలో చాలామంది చూసేశారు. దాని వ‌ల్ల టీవీ లో టెలీకాస్ట్ అయిన‌ప్పుడు అంత‌గా శ్ర‌ద్ధ చూపించ‌లేక‌పోవొచ్చు. ఓటీటీలో లేక‌పోతే మాత్రం... సాహో మ‌ళ్లీ కొత్త రికార్డులు సృష్టించేదే.

ALSO READ: అంజనా ప్రొడక్షన్స్‌ బేనర్‌లో మెగాస్టార్‌ సినిమా?