ENGLISH

కొత్త గెటప్ లో ప్రభాస్

15 January 2024-12:43 PM

సలార్ హిట్ తో మంచి జోరు మీదున్న ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.  సలార్ సెకండ్ పార్ట్, కల్కి, స్పిరిట్, మారుతీ సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. మేలో కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.  సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మారుతి డైరెక్షన్లో వస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. మొదట నుంచి ఈ మూవీకి రక రకాల టైటిల్స్ ప్రచారం జరిగింది. కానీ ఈ మూవీ టైటిల్ 'రాజా సాబ్' అని  మేకర్స్ అధికారికంగా ఒక వీడియో ద్వారా తెలియజేశారు. టైటిల్ అనౌన్స్ చేస్తూ ప్రభాస్ లుక్ కూడా రిలీజ్ చేశారు.


ఈ వీడియోలో ప్రభాస్ లుంగీ కట్టుకొని సరికొత్త గెటప్ లో కనిపించారు. డైనోసార్ ఇన్ డార్లింగ్ అవతార్ అంటూ ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు.  కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు అంటూ  ప్రచారం  జరుగుతోంది. త్వరలోనే మిగిలిన అన్ని విషయాలను తెలియచేయనున్నారు మూవీ టీమ్. 1st టైం ప్రభాస్ ని ఈ లుక్  లో చూసిన ఫాన్స్ చాల థ్రిల్ ఫీల్ అవుతున్నారు.  కూల్‌గా, కొత్తగా, కలర్‌ ఫుల్‌గా ఉంది ప్రభాస్ లుక్. హెయిర్‌స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే కొత్తగా ఉంది. మారుతి తన సినిమాల్లో హీరోల లుక్స్‌పై చాలా కేర్ తీసుకుంటారు. అది ఈ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలక పాత్ర లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.