ENGLISH

ప్రభాస్, త్రివిక్రమ్ తో మైత్రీ మూవీస్‌?

21 January 2024-14:30 PM

గుంటూరు కారం మూవీతో విమర్శలు పాలైన త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో మూవీ చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీ తో మూవీ ఉంటుందని, పుష్ప 2  తరవాత బన్నీ, త్రివిక్రమ్ కాంబో రిపీట్  అవుతుందని అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ ఎప్పుడో ఇచ్చిన మాట ప్రకారం  మైత్రీ మూవీస్‌కు ఓ సినిమా చేయాల్సి ఉంది.  కానీ హారిక హాసిని సంస్థకు మాత్రమే సినిమాలు చేస్తానని కట్టుబడిన తరువాత మైత్రీ మూవీస్ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కు ఇచ్చారు త్రివిక్రమ్. ఆ సందర్భంలో చాలా గందరగోళాలు నడిచాయి. చివరికి ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయ్యి సెటిల్ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి త్రివిక్రమ్ కి  మైత్రీమూవీస్ తో మైత్రి చెడిందని పుకార్లు పుట్టుకొచ్చాయి.


కానీ రీసెంట్ గా  మైత్రీ సంస్థ త్రివిక్రమ్ ను మళ్ళీ కాంటాక్ట్ చేసిందని సమాచారం. మైత్రీ సంస్థకు ప్రభాస్ ఓ సినిమా చేయాలి. అది ఎప్పుడో కుదిరిన ఒప్పందం. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని టాక్. హను రాఘవపూడి  డైరక్షన్ లో సినిమా చేయటానికి ఓకే అయ్యింది. అది కాక త్రివిక్రమ్ అయితే ఇంకో సినిమా కూడా చేస్తానని ప్రభాస్ మాట ఇవ్వటంతో  మైత్రీ మళ్ళీ త్రివిక్రమ్ కోసం వెళ్ళింది.  కానీ త్రివిక్రమ్ నో చెప్పినట్లు సమాచారం. త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకున్న ప్రభాస్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.