ENGLISH

ప్రభుదేవా విలనిజం చూస్తారా?

15 March 2017-16:49 PM

కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు కూడా అయిన ప్రభుదేవాలో విలనిజం ఎప్పుడైనా చూశామా? ఓ తెలుగు సినిమాలో కామెడీ విలన్‌గా నటించాడు ప్రభుదేవా. 'మైఖేల్‌ మదన కామరాజు' సినిమా అది. అందులో సరదా సరదాగా ప్రభుదేవా క్యారెక్టర్‌ ఉంటుంది. సరదాగానే కొంచెం నెగిటివ్‌ యాంగిల్‌ చూపిస్తాడు ప్రభుదేవా. అయితే అది పూర్తిస్థాయి విలనిజం అని చెప్పలేం. కానీ ఈసారి ప్రభుదేవా పూర్తిస్థాయి విలనిజం పండించబోతున్నాడట. హాట్‌ ఖబర్‌ ఏంటంటే ఇది తమిళంలో నయనతార నటించిన సినిమా. ఆ సినిమాని హిందీలోకి రీమేక్‌ చేస్తున్నారు. 'కొలైయుథిర్‌ కాలమ్‌' సినిమా హిందీలోకి రీమేక్‌ అవుతుండగా, ఇందులో భూమిక, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారట. ఇక ముద్దుగుమ్మ నయనతార విషయానికి వస్తే, ఆమెకీ ప్రభుదేవాకీ మధ్య ప్రేమ ముదిరి పెళ్ళిదాకా వెళ్ళింది. అయితే తృటిలో వీరిద్దరి వివాహం తప్పిపోయిందన్న సంగతి అందరికీ తెలుసు. 'కొలైయుధిర్‌ కాలమ్‌' సినిమా రీమేక్‌కి విషు భగ్నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నారు. లండన్‌లో ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రభుదేవా క్యారెక్టర్‌పై ఆశక్తి నెలకొంది. ఆయన పాత్ర చాలా కొత్తగానూ మరో పక్క అందరి ప్రశంసలు అందుకునేలా కూడా ఉంటుందట. 

ALSO READ: సుమంత్ కొత్త సినిమా మొద‌లైంది