ENGLISH

ప్రదీప్.. సుడిగాలి సుధీర్... ఇంత క్రేజా!?

19 February 2024-12:07 PM

ఆర్మాక్స్ మీడియా సంస్థ  తెలుగులో మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. తెలుగు వాళ్లకు బాగా ఇష్టమైన టీవీ పర్సనాలిటీస్ ఎవరో  ఈ సర్వే ద్వారా వెల్లడి అయ్యింది. ఆర్మాక్స్ మీడియా 2024  జనవరి, కోసం రిలీజ్ చేసిన ఈ జాబితాలో ఐదుగురు ప్రముఖ టీవీ పర్సనాలిటీస్ కు చోటు దక్కింది. ప్రముఖ యాంకర్లు ప్రదీప్, సుమతోపాటు జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్రలాంటి వాళ్లు ఇందులో స్థానం సంపాదించారు.


ఆర్మాక్స్ క్యారెక్టర్స్ ఇండియా లవ్ పేరుతో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో జనవరి నెలకుగాను తెలుగులో మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ జాబితాలో మొదటి  స్థానంలో యాంకర్ ప్రదీప్ నిలవడం విశేషం. ఈటీవీలో వచ్చే 'ఢీ' డ్యాన్స్ షోకుగాను ప్రదీప్ టాప్ లో ఉన్నాడు. ఇక తర్వాతి స్థానంలో జబర్దస్త్ షో ద్వారా  తెలుగు వాళ్లకి  బాగా చేరువ అయిన మల్టీ టాలెంటెడ్  కమెడియన్ సుడిగాలి సుధీర్ ఉన్నాడు.


సుధీర్ మొదట జబర్దస్త్ షోతో తన జర్నీ స్టార్ట్ చేసినా, తరువాత తనకి వచ్చిన ఫేమ్ తో మిగతా ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా కూడా అవకాశాలు పొందాడు. సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ క్రమేపి హీరో అవతారం ఎత్తాడు. జబర్దస్త్ షోతోపాటు,  ఈటీవీ 'ఢీ' ప్రోగ్రాం ,  శ్రీదేవి డ్రామా కంపెనీల్లాంటి షోలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. సుధీర్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.  సుధీర్ తరువాత స్థానంలో తన పంచ్ లతో కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది నిలిచాడు. ఆది కూడా ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల్లాంటి షోలతో పాపులర్ అయ్యాడు.


నాలుగో స్థానంలో తన యాంకరింగ్ తో, నవ్విస్తూ, మెప్పిస్తూ, పలువురి మనసులు దోచుకున్న   సుమ నిలిచింది. సుమ యాంకరింగ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. కెరియర్ ప్రారంభం నుంచి సుమకి అదే క్రేజ్ ఉంది. సుమ ఈటీవీ లో చేసే  క్యాష్ షోకి గాను ఈ లిస్ట్ లో టాప్ ఫోర్  లో నిలిచింది. ఐదో స్థానంలో చమ్మక్ చంద్ర ఉన్నాడు. సినిమాల ద్వారానే తెలుగు వారికి పరిచయమైనా, తర్వాత జబర్దస్త్ షోతో ప్రతి ఇంటికీ అతడు చేరువయ్యాడు.