ENGLISH

చిరిగిన ప్యాంటు, మెరిసిన సొగసు

02 September 2017-19:23 PM

క్లాసిక్‌ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌, గ్లామర్‌ కంచె ఎప్పుడో తెంచేసింది. ఓ పక్క సింప్లీ సూపర్బ్‌ అన్నట్లే కన్పిస్తుంది అలాగే మరో పక్క వావ్‌ హాటెస్ట్‌ బ్యూటీ అనిపిస్తుంటుంది. మోడ్రన్‌ దుస్తుల్లో కనిపించడం అంటే ఈ ముద్దుగుమ్మకి పిచ్చ ఇష్టమట. ఆ ఇష్టం ఇప్పుడిప్పుడే నెరవేరుతోందంటోంది ప్రగ్యా. పొట్టి దుస్తుల్లో, తనలోని గ్లామర్‌నంతటినీ చిలకరించి, కుర్రకారుకు కిర్రాక్‌ పుట్టిస్తోంది. ఇదిగో ఈ ఫోటో చూశారా? చిరిగిన జీన్స్‌లోనూ ఆమె సొగసు భలే మెరుపులు విరజిమ్ముతోంది. ఆమె ప్రత్యేకత అదే. ఫ్యాషన్‌కి సాటేది లేదంటే ఇదే కాబోలు.