ENGLISH

రాజమౌళి కోసం ప్రశాంత్ వర్మ త్యాగం

12 January 2024-14:03 PM

హనుమాన్ తో హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ వరసగా ప్రమోషన్స్ లో పాల్గోంటున్నాడు. ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గూర్చి కొన్నివిషయాలు తెలిపాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ రాజమౌళి కారణంగా పక్కన పెట్టేశానని కూడా చెప్పాడు. దేవుడి క్యారెక్టర్‌ ని తీసుకుని, ఒక సూపర్ హీరో సినిమా చేయవచ్చని, అలా హిందూ దేవుళ్లను ఒక్కొక్కరితో ఒక సినిమాటిక్ యూనివర్స్‌నే సృష్టించవచ్చని, ఒక విభిన్నమైన ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, పీసీయూ అనేదాన్ని ప్రారంభించాడు. ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన సినిమానే ‘హనుమాన్’.  తక్కువ బడ్జెట్‌తో, తీసిన  విజువల్ వండర్ గా అందర్నీ ఆకర్షిస్తోంది.


‘హనుమాన్’ విడుదలకు ముందు ప్రశాంత్ వర్మకి మహాభారతంపై ఎందుకు సినిమా చేయాలనుకోలేదు అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి ప్రశాంత్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘‘నా కెరీర్ మొదట్లో నాకు మహాభారతంపై ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. కానీ రాజమౌళి గారు దానిపై సినిమాను చేస్తానని అనౌన్స్ చేయగానే నేను ఆ ఆలోచనను పక్కన పెట్టేశాను’’ అని అన్నాడు. రాజమౌళి తను రిటైర్ అయ్యేలోపు కచ్చితంగా మహాభారతంపై సినిమాను తెరకెక్కిస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు. ఈ కారణం తోనే తాను మహాభారతాన్ని టచ్ చేయలేదని ప్రశాంత్ చెప్పాడు.