ENGLISH

నెక్స్ట్ సినిమా అదే అంటున్న ప్రశాంత్ వర్మ

11 August 2020-10:47 AM

'అ!' సినిమాతో విమర్శలకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణను కూడా సాధించారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం 'జోంబి రెడ్డి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది అందరినీ ఆకట్టుకుంది.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో  ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ  'జోంబి రెడ్డి' తర్వాత తను చేయబోయే సినిమా గురించి కూడా వెల్లడించారు. ఈ సినిమా తర్వాత  'అ!' కు సీక్వెల్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 'అ!' సీక్వెల్ కోసం పలువురు బాలీవుడ్ నిర్మాతలు తనను సంప్రదించారని, అయితే తనకు తెలుగులోనే ఈ సినిమాను మొదటగా చేయాలని ఉందని చెప్పారు. 'జోంబి రెడ్డి'   సినిమా పూర్తయిన వెంటనే  'అ!' సీక్వెల్ పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు.

'అ!' సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మించిన సంగతి తెలిసిందే. మరి సీక్వెల్ కూడా ఆయనే నిర్మిస్తారా లేదా అనే విషయంపై మాత్రం ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వలేదు.

ALSO READ: రవితేజ కోసం మాస్ టైటిల్ ఫిక్స్ చేసిన వర్మ