ENGLISH

రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్

24 August 2017-13:17 PM

సాధారణంగా సినీ రంగానికి చెందిన ప్రముఖుల పెళ్ళిళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాంటిది ఒక హీరోయిన్ వివాహం మాత్రం అతిసాధారణంగా జరిగింది.

వివరాల్లోకి వెళితే, నటి ప్రియమణి ఈరోజు ఉదయం తన స్నేహితుడైన ముస్తాఫారాజాతో బెంగులురులోని జయనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది. గత జూలైలోనే వీరు తమ వివాహానికి సంబంధించిన రిజిస్టర్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది.

ఇక గురువారం జేపీనగర్ లోని ఒక హోటల్ లో సినీరంగానికి చెందిన ప్రముఖులకి విందు ఇవ్వనున్నట్టు ప్రియమణి కుటుంబసభ్యులు తెలియచేశారు.

ప్రియమణి మాత్రం పెళ్ళి తరువాత కూడా సినిమాలు చేస్తాను అని స్పష్టంచేసింది.
 

 

ALSO READ: బిగ్ బీ.. బాలకృష్ణని కాదని చిరుకి ఎందుకు ఓకే అన్నాడో తెలుసా?