ENGLISH

ప్లాన్ మార్చిన దిల్‌రాజు

05 August 2020-09:44 AM

క‌రోనా వ‌ల్ల చిత్ర‌సీమ సంక్షోభంలో ప‌డింది. సినిమా నిర్మాణం ఇప్పుడు క‌త్తి మీద సామే. బ‌డా బ‌డా నిర్మాత‌లు సైతం `ఇది స‌రైన స‌మ‌యం కాదు` అంటూ ప‌క్క‌కు త‌ప్పుకుంటున్నారు. మిగిలిన వాళ్లు గేమ్ ప్లాన్ మార్చుకుంటున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నారు. దిల్ రాజు చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. మ‌రిన్ని చిన్న సినిమాల రూప‌క‌ల్ప‌న‌కు ఆయ‌న ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈసారి సోలో నిర్మాత‌గా మాత్రం సినిమాలు తీయ‌ర్ట‌. కొంత‌మంది ద‌ర్శ‌కుల‌తో క‌లిసి....పార్ట్న‌ర్ షిప్ ప్రాతిప‌దిక‌పై సినిమాలు తీయ‌బోతున్నాడ‌ట‌.


సుకుమార్‌, వ‌క్కంతం వంశీ, వంశీ పైడిప‌ల్లి, అనిల్ రావిపూడి.. ఇలా కొంత‌మంది యువ ద‌ర్శ‌కులు రాసిన క‌థ‌ల్ని.. వాళ్ల శిష్యుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించ‌నున్నార్ట‌. ఈ సినిమాల‌కు ఆయా ద‌ర్శ‌కుల్ని నిర్మాత‌లుగా మారుస్తార్ట‌. సుకుమార్ క‌థ‌తో, సుకుమార్ శిష్యుడు ఓ సినిమా తీస్తున్నాడంటే ఆస‌క్తి పెరుగుతుంది క‌దా. అలా సినిమా కి మంచి ప‌బ్లిసిటీ తెచ్చుకుని, చిన్న సినిమాల‌కు మంచి లాభాల‌కు అమ్ముకోవాల‌న్న‌ది దిల్ రాజు ప్లానింగ్‌. ఈ సిరీస్ లో ఇప్ప‌టికే కొన్ని క‌థ‌లు సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. వాటి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డవుతాయి.  

ALSO READ: ఆసుప‌త్రిలో ఫృథ్వీరాజ్‌