ENGLISH

మీడియా పై దిల్ రాజు గరం...గరం

09 January 2024-10:20 AM

టాలీవుడ్ సంక్రాతి సినిమాలతో, థియేటర్స్ వివాదాలతో హాట్ హాట్ గా ఉంది. ఈ సంక్రాంతి సీజన్‍కు పెద్ద సినిమాలు 4 విడుదల అవుతున్నాయి. ఈ  నేపథ్యంలో థియేటర్స్ కొరత వలన హనుమాన్ మూవీ రిలీజ్‍ను ఆపాలని  దిల్‍రాజ్ ప్రయత్నించారని, రూమర్లు వచ్చాయి. ఈ విషయంపై దిల్‍రాజు రీసెంట్ గా  స్పందించారు. “దిల్‍రాజ్ ఏమీ స్పందించరని అనుకుంటున్నారా.. తాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నా. దిల్‍రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశా. వ్యాపార పరంగా వచ్చే కొన్ని వివాదాలను మీడియా అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. మీ వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ కోసం వాడుకుంటున్నారు. అది 100 శాతం తప్పు. హనుమాన్ సినిమాను ఆపాలని తాను ప్రయత్నించినట్టు వచ్చిన పుకార్లు పూర్తిగా అవాస్తవమని, జనవరి 14న రిలీజ్ చేస్తే థియేటర్లు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుందని మాత్రమే సలహా ఇచ్చానని, మూవీ ఆపాలని అసలు చెప్పలేదని, కావాలంటే ఆ మూవీ నిర్మాత, దర్శకుడితో డిబేట్ పెట్టండని" దిల్‍రాజు అన్నారు.


'గుంటూరు కారం రిలీజ్ నేపథ్యంలో నైజాంలో వెంకటేష్, నాగార్జున సినిమాలకే థియేటర్లు కష్టంగా ఉందని, హనుమాన్‍‍కు అడిగినన్ని థియేటర్లు ఎలా వస్తాయని అన్నారు. ఈ వివాదాల వల్ల కోట్లు పెట్టినా రాని ప్రమోషన్లు హనుమాన్‍కు వచ్చేశాయని, హనుమాన్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్న వాళ్లలో తాను ఒకడినని, హనుమాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని, మిగిలిన ఎక్కడా థియేటర్ల సమస్య లేదు కదా' అని చెప్పారు.


ఫిల్మ్ ఛాంబర్‌ అధ్యక్షుడిగా తాను మీటింగ్ పెట్టి హీరో రవితేజను ఒప్పించి సంక్రాంతి రేసు నుంచి ఈగల్ సినిమాను ఆపామని, తాను కొన్న తమిళ మూవీ అయలాన్ తెలుగు వెర్షన్ ని కూడా తెలుగులో రిలీజ్ చేయకుండా  వాయిదా వేస్తున్నట్టు దిల్‍రాజు చెప్పారు.


ఆయన పై తప్పుడు వార్తలు రాస్తున్న రెండు వెబ్ సైట్స్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు  ఆ వెబ్సైట్ కి చెందిన వారు  బయట దొరికితే  తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేసిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. దీనితో ఇండస్ట్రీ మొత్తం అసహ్యించుకునే ఒక ప్రముఖ బ్లాక్ మెయిలర్ మిస్ అయ్యాడు, అతను  గాని  రాజు గారికి దొరికి ఉంటే గట్టిగా దెబ్బలు కూడా పడి ఉండేవి ఏమో అంటున్న జర్నలిస్ట్స్ ఈ వీడియో తెగ వైరలవుతోంది.