ENGLISH

Project K: 'ప్రాజెక్ట్ కె'.. మ‌రింత ఆల‌స్యం

18 August 2022-11:27 AM

ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం `ప్రాజెక్ట్ కె`. నాగ అశ్విన్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీపికా ప‌దుకొణె క‌థానాయిక‌. 2023 ద‌స‌రాకి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ఇటీవ‌లే అశ్వ‌నీద‌త్ ప్ర‌క‌టించారు. కానీ... ఇప్పుడు ఈ సినిమా మ‌రింత ఆల‌స్య‌మ‌య్యేఅవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ - కె... 2024 సంక్రాంతికి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌న్న‌ది లేటెస్ట్ న్యూస్‌.

 

ఈ ఆల‌స్యానికి కార‌ణం..స‌లార్‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని 2023 సెప్టెంబ‌రులో విడుద‌ల చేయ‌బోతున్నారు. స‌లార్‌కీ, ప్రాజెక్ట్ కెకీ మ‌ధ్య అట్టే విరామం లేదు. అందుకే... ప్రాజెక్ట్ కెని వెన‌క్కి తోసిన‌ట్టు తెలుస్తోంది. పైగా ప్రాజెక్ట్ కె... నిర్మాణం అంత ఈజీ కాదు.

 

ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్ వ‌ర్క్ చాలా చేయాల్సి ఉంది. అందుకే ప్రాజెక్ట్ కె... ఆల‌స్య‌మ‌వుతోంది. అన్నింటికింటే ముఖ్యంగా ద‌స‌రా కంటే సంక్రాంతి పెద్ద సీజ‌న్‌. కాబ‌ట్టి... ఇలాంటి భారీ సినిమాలు సంక్రాంతికి రావ‌డ‌మే బెట‌ర్స్ అనేది మేక‌ర్స్ ఆలోచ‌న‌.

ALSO READ: సినిమా డిజాస్ట‌ర్‌.. అయినా న‌ష్టాల్లేవు