ENGLISH

Puri Jagannadh, Bandla Ganesh: నోరు జారొద్ద‌న్న పూరి... బండ్ల‌కు కౌంట‌ర్ ఇదేనా?

27 June 2022-17:00 PM

ఈమ‌ధ్య చోర్ బ‌జార్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో బండ్ల గ‌ణేష్ చేసిన కామెంట్లు అంద‌రికీ గుర్తుండే ఉంటాయి. ఆ సినిమా కంటే.. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో బండ్ల ఇచ్చిన స్పీచే ఎక్కువ‌గా హైలెట్ అయ్యింది. ఈ సినిమా ఫంక్ష‌న్‌కి పూరి రాక‌పోవ‌డంతో హ‌ర్ట‌యిన బండ్ల ఏదేదో మాట్లాడాడు. యాక్టింగ్ రానివాళ్ల‌ని, డైలాగ్ చెప్ప‌డం రానివాళ్ల‌ని సూప‌ర్ స్టార్ల‌ని చేసిన పూరి.. కొడుకుని ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు? అని అంద‌రి ముందూ నిల‌దీశాడు.

 

పూరి ఆకాష్ డేట్ల కోసం పూరి ఎదురు చూసే రోజు వ‌స్తుంద‌ని జోస్యం చెప్పాడు. నీ కొడుకుని ప‌ట్టించుకోవా? అంటూ ప్ర‌శ్నించాడు. బండ్ల మాట‌లు.. క‌చ్చితంగా పూరితో త‌న కుటుంబానికి ఉన్న రిలేష‌న్‌ని నిల‌దీసేలా ఉన్నాయి. వాటిపై పూరి ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు. అయితే.. ఇప్పుడు పూరి మ్యాజింగ్స్ పేరుతో ఓ ఆడియోని విడుద‌ల చేశాడు పూరి. ఇందులో `నోటి దూల‌` గురించి ప్ర‌స్తావించాడు. ఎవ‌రినీ హ‌ర్ట్ చేసే మాట‌లు మాట్లాడొద్ద‌ని, అలా మాట్లాడేబ‌దులు నాలిక కోసేసుకోవ‌డం మంచిద‌ని హిత‌వు ప‌లికాడు. ఎప్పుడూ పాజిటీవ్ మాట‌లే మాట్లాడాల‌ని, నోరు డ్రైనేజ్ చేయొద్ద‌ని హిత‌వు ప‌లికాడు. `నొప్పింప‌క తానొవ్వ‌క త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తీ` అంటూ సుమ‌తీ శ‌త‌కాన్ని ప్ర‌స్తావించాడు. ఇదంతా.. బండ్ల‌కు కౌంట‌ర్ గా ఇచ్చిన రిప్లై అని నెటిజ‌న్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఎక్క‌డా ఈ ఆడియోలో బండ్ల ప్ర‌స్తావ‌న రాలేదు. కాక‌పోతే.. టైమ్లీగా విడుద‌ల చేసిన ఆడియో కాబ‌ట్టి... అంద‌రూ దీన్ని బండ్ల‌కు కౌంట‌ర్‌గానే భావిస్తున్నారు.

ALSO READ: 'నాంది' కాంబో రిపీట్