ENGLISH

ఈసారి పూరీ జగన్నాధ్‌ డైరెక్షన్‌ చేయడట.!

27 November 2018-18:49 PM

పూరీ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా 'మెహబూబా' సినిమాని సొంత డైరెక్షన్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన అంచనాల్ని అందుకోకపోవడంతో కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు ఆకాష్‌ పూరీ. అతి త్వరలోనే హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. అయితే ఆ సినిమాకి పూరీ జగన్నాధ్‌ డైరెక్షన్‌ చేయట్లేదట. ఆకాష్‌ హీరోగా తదుపరి చిత్రం కూడా తన డైరెక్షన్‌లోనే ఉంటుందని 'మెహబూబా' టైంలోనే పూరీ జగన్నాధ్‌ చెప్పాడు.

కానీ ఇప్పుడు తన ఆలోచనను వెనక్కి తీసుకున్నాడట. అయితే ఆకాష్‌ సినిమాకి నిర్మాతగా పూరీ వ్యవహరిస్తారనీ తెలుస్తోంది. అలాగే తన డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోనే పని చేసే ఓ వ్యక్తిని దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడట. అలాగే ఓ కొత్త భామ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కాబోతోందట. ఇలా కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్‌తో పూరీ జగన్నాధ్‌ తన సొంత నిర్మాణంలో ఆకాష్‌తో సినిమా రూపొందించబోతున్నాడన్న మాట.

'మెహబూబా' రిజల్ట్‌ ఆశించిన స్థాయిలో రాకపోయినా, నటుడిగా ఆకాష్‌ పూరీకి ఆ సినిమా ఓ ఉన్నతినిచ్చిందనే చెప్పాలి. ఇక మూడో సినిమాతో తనలోని నటున్ని మరింత ఉన్నతంగా బయటికి తీసుకొస్తానని చెబుతున్నాడు ఆకాష్‌ పూరీ. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్‌ త్వరలోనే రివీల్‌ చేయనున్నారట. అన్నట్టు ఈ సినిమాకి 'వాస్కోడగామా' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.

ALSO READ: 10 రోజుల్లో 20 కోట్లు.. ఇది విజయ్ దేవరకొండ స్టామినా..!