మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా పుష్ప2 కోసం వరల్డ్ వైడ్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. బాహుబలి, కేజీఎఫ్ సీక్వెల్స్ కి ఎంత క్రేజ్ ఏర్పడిందో పుష్ప సీక్వెల్ కి కూడా అంత క్రేజ్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో మూవీ పోస్ట్ ఫోన్ అయితే ప్రేక్షకులు అసహనానికి గురి అయ్యి దానిపై శ్రద్ద పెట్టడం మానేస్తారు. కానీ ఎన్ని సార్లు పోస్ట్ ఫోన్ అయినా పుష్ప 2 పై క్రేజ్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు. పుష్ప మొట్టి పార్ట్ ప్రాంతీయ చిత్రంగా వచ్చి, అనూహ్యంగా పాన్ ఇండియా సినిమా అయిపోయింది. పార్ట్ వన్ సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రభంజనం సృష్టించింది. దీనితో పుష్ప 2 పై క్రేజ్ పెరిగింది. ఆ క్రేజే మార్కెట్ ని కూడా పెంచింది. ఎంతలా అంటే ఒక కమర్షియల్ మూవీ రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే1000 కోట్లు కలక్ట్ చేసింది.
ఒక తెలుగు సినిమా బిజినెస్ ఈ స్థాయిలో జరగటం రికార్డ్ అనే చెప్పాలి. అన్ని భాషల రైట్స్, ఓవర్సీస్, శాటిలైట్ , డిజిటల్ ఇలా అన్ని కలిపి వెయ్యి కోట్లు దాటిపోయిందని ట్రేడ్ పండితులు అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప-2' థియేట్రికల్ రైట్స్ 220 కోట్లకి సేల్ అయ్యాయి. కర్ణాటక రైట్స్ 30 కోట్లకి, తమిళనాడు 50 కోట్లు, కేరళలో 20 కోట్లకు సేల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా సౌత్ లో 100 కోట్ల బిజినెస్ జరిగింది. పుష్ప-2 హిందీ వెర్షన్ రైట్స్ 200 కోట్లకి సేల్ అయ్యాయి. అంటే ఇంచు మించుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ లానే.
ఓవర్సీస్ రైట్స్ అన్నీ కలిపి 120 కోట్లు కలక్ట్ చేసినట్లు సమాచారం. టోటల్ గా 'పుష్ప2 ' థియేట్రికల్ బిజినెస్ 640 కోట్ల బిజినెస్ జరిగింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'పుష్ప-2' డిజిటల్ రైట్స్ 275 కోట్లకి సొంతం చేసుకుందట. ఓటీటీ లో ఇంత భారీ ధరకి అమ్ముడైన సినిమా ఇదే కావటం విశేషం. ఇవి కాకుండా మ్యూజిక్ రైట్స్ 65 కోట్లు, శాటిలైట్ రైట్స్ 85 కోట్లకి సేల్ అయినట్లు సమాచారం. టోటల్ ఇవన్నీ కలిపి 1065 కోట్లు బిజినెస్ చేసాడు పుష్ప రాజ్.