ENGLISH

పుష్ష కోసం మ‌రో విల‌న్‌

25 December 2020-12:28 PM

పుష్ష‌ల విల‌న్ల హంగ‌మా మామూలుగా లేదు. రోజుకో విల‌న్ పేరు వినిపిస్తోంది. రావు ర‌మేష్‌, అజ‌య్ ఘోష్ లాంటి వాళ్లు ఇప్ప‌టికే టీమ్ లో చేరిపోయారు. సునీల్ కూడా విల‌న్ గా న‌టించ‌బోతున్నాడ‌ని టాక్‌. ఇప్పుడు మ‌రో విల‌న్ వ‌చ్చి చేరాడు. త‌నే ఆర్య‌.

 

త‌మిళంలో హీరో క్రేజ్ సంపాదించుకున్న ఆర్య తెలుగులోనూ పాపుల‌రే. `సైజ్ జీరో`లో న‌టించాడు. `వ‌రుడు`లో విల‌న్ ఆర్య‌నే. ఇప్పుడు `పుష్ష‌` కోసం త‌న‌నే ప్ర‌ధాన విల‌న్ గా ఎంచుకున్నార‌ని స‌మాచారం అందుతోంది. ముందు ఈ పాత్ర కోసం విజ‌య్ సేతుప‌తిని ఎంచుకోవాల‌నుకున్నారు. కానీ.. త‌ను ఒప్పుకోలేదు. ఆ త‌ర‌వాత‌.... బాబీ సింహా పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎందుకో.. తాను కూడా డ్రాప్ అయ్యాడు. ఆ ప్లేసులోనే ఆర్య వ‌చ్చాడ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఆర్య ఎంట్రీని అధికారికంగా ఖ‌రారు చేసే అవ‌కాశాలున్నాయి.

ALSO READ: పాతిక ల‌క్ష‌లు పోయినందుకు బాధ లేద‌ట‌!