ENGLISH

'పుష్పక విమానం' మూవీ రివ్యూ & రేటింగ్!

12 November 2021-12:45 PM

నటీనటులు : ఆనంద్ దేవరకోండ, గీత్ సైని, సాన్వి మేఘన, సునీల్ తదితరులు 
దర్శకత్వం : దామోదర్
నిర్మాత‌లు : గోవర్ధన్ రావ్ దేవేరకొండ, విజయ్, ప్రదీప్ 
సంగీతం : మార్క్ రాబిన్, రామ్ మిర్యాల, సిద్ధర్థ్ శివదాసుని, అమిత్ దాసాని
సినిమాటోగ్రఫర్ : హెస్టిన్ జోస్ జోసెఫ్
ఎడిటర్: రవితేజ గిరజాల


రేటింగ్: 2.25/5


హీరో పెళ్ళాం లేచిపోతుంది ? ఇలాంటి పాయింట్ తో కథ చెబితే చాలా మంది హీరోలు ముందుకురారు. 'పుష్పక విమానం' పాయింట్ కూడా అదే. ఈ సినిమా కథని కూడా చాలా మంది హీరోలు రిజెక్ట్ చేశారు. కానీ ఆనంద్ దేవర కొండ ముందుకు వచ్చాడు. కథ కొత్తగా వుంటుందని నమ్మాడు. 'మిడిల్ క్లాస్ లాంటి మేలోడిస్'' తర్వాత మరో యూత్ ఫుల్ మూవీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఆనంద్ అంచనాలు అందుకున్నాడా? కథ పై పెట్టుకున్న ఆశలు ఫలించాయా?  ఇంతకీ ఏమిటి 'పుష్పక విమానం' కథ ??


కథ:


చిట్టిలంక  సుందర్ (ఆనంద్ దేవరకొండ) సామన్య మధ్యతరగతి వ్యక్తి. వృత్తి గవర్నమెంట్ టీచర్. మీనాక్షిని(గీత్ సైనీ) వివాహం చేసుకుంటాడు. సుందర్ హనీమూన్ కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. ఒక రోజు మీనాక్షి కనిపించకుండపోతుంది. అసలు మీనాక్షి ఎక్కడి వెళ్ళింది? ఇంట్లో నుంచి పారిపోయిందా? లేదా ఏదైనా ఆపదలో చిక్కుకుందా? తన భార్య ఇంట్లో నుంచి పారిపోయిందని బయటికి చెప్పలేక అంతా సజావుగానే వుందని నమ్మించడానికి భర్త సుందర్ ఎలాంటి అవస్థలు పడ్డాడు? చివరికి మీనాక్షి దొరికిందా లేదా? అనేది వెండితెరపై చూడాలి.


విశ్లేషణ:


కొత్త దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారు. కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే సమయంలో సినిమా  కథ గురించి పెదగ్గా ఆలోచించే అవసరం లేదని,  చిన్న పాయింట్ తో లైటర్ వెయిన్ లో సినిమాని నడిపెయొచ్చనే అభిప్రాయంలో వుంటున్నారు. ఇది తప్పు కాదు. అయితే ఇది అన్నివేళలా వర్క్ అవుట్ అవ్వదు. ప్రేక్షకుడు టికెట్టుకొని థియేటర్ లో అడుగుపెడుతున్నాడంటే అతడి సమయానికి విలువ వుండే కంటెంట్ అందించే బాధ్యత ఫిలిం మేకర్స్ పై వుంటుంది. అలా కాకుండా చిన్న పాయింట్ పట్టుకొని షార్ట్ ఫిలింకి ఎక్కువ సినిమాకి తక్కువ అనే టైపులో థియటర్ బొమ్మ చూపిస్తే ప్రేక్షకుడికి మళ్ళీ చిన్న సినిమాకి రావాలనే నమ్మకం పోతుంది.


పుష్పక విమానం దర్శకుడు దామోదర్ కూడా ఒక చిన్న పాయింట్ పట్టుకున్నాడు. పెళ్లి జరిగిన కొత్తలోనే భార్య కనిపించకుండా పొతే భర్త ఎలా రియాక్ట్ అవుతాడు ? భార్య పారిపోయిందని చెప్పలేక ఎలాంటి అవస్థలు పడతాడనే పాయింట్ చుట్టూ కథ అల్లు కున్నాడు. ఆలోచన వరకూ బాగానే వుంది. అయితే ఆ ఆలోచన వెండితెర మీదకు వచ్చేసరికి బోరింగ్ గా మారింది. హీరో చుట్టూ కొన్ని పాత్రలు సృష్టించి వాటితో టైం పాస్ చేసేయాలనే ఆలోచన అడుగడుగునా కనపడింది.


ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే నడిపేశారు. స్కూల్, అపార్ట్ మెంట్ చుట్టూ పాత్రలు .. భార్య బాదితుడిగా సుందర్.. ఫస్ట్ అంతా ఇలా లైటర్ వెయిన్ లో నడిపేశారు. ఇంటర్వెల్ బాంగ్ కోసం ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ని చూపించినా విరామం తర్వాత అది చప్పబడిపోతుంది. సెకండాఫ్‌ మరీ  నీరసంగా సాగుతుంది. సన్నీవేషాలు నిదానంగా సాగాదీతగా అనిపిస్తాయి.కధలో సంఘర్షణ వుండదు. ఇక క్లైమాక్స్ కూడా చాలా ఫోర్స్ ఫుల్ గా అనిపిస్తుంది. సినిమాని చాలా సహజంగా తీయాలని అనుకున్నారు. కానీ కధని క్లైమాక్స్ కి డ్రైవ్ చేసిన విధానం మాత్రం అసహజంగా అనిపిస్తుంది. ఒక దశలో ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా వుంటుంది.


నటీనటులు:


ఆనంద్ దేవరకొండకు ఇది మూడో సినిమా. ప్రేక్షకులు తనని ఎలా చూడాలని అనుకుంటున్నారో బాగా తెలుసుకున్నాడు. హీరోయిజం జోలికి పోకుండా తనలోని నటుడిపైనే ద్రుష్టి పెట్టాడు. సుందర్ పాత్రలో ఒదిగిపోయాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. చాలా సహజంగా కనిపించాడు. ఎంత సహజంగా కనిపించినప్పటికీ వీక్ స్క్రిప్ట్ కారణంగా కొన్ని చోట్ల తానూ క్లూలెస్ గా నిలబడిపోవాల్సి వచ్చింది. 


ఫీమేల్ లీడ్స్ గా చేసిన గీత్  సైనీ , సాన్వే మేఘన కు ఓకే మార్కులు పడతాయి. సాన్వే మేఘన పాత్ర చిన్నదైనప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకుంది. సునీల్ ది ఇందులో కీలకమైన పాత్ర. సునీల్ పాత్రతోనే కథ ముందుకు జరుగుతుంటుంది. సునీల్ అనుభవంతో ఆ పాత్రని ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నరేష్ పాత్ర ఓకే. హర్ష వర్ధన్ ని ఇంకా వాడుకోవాల్సింది. మిగతా పాత్రధారులు పరిధి మేర నటించారు.


సాంకేతికంగా:


సింపుల్ కథ ఇది. నిర్మాణం కూడా సింపుల్ గానే వుంది. కెమరాపనితనం ఓకే. నేపధ్య సంగీతం బావుంది. ఎడిటింగ్ ఇంకా కొంచెం షార్ఫ్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఓకే.


ప్లస్ పాయింట్స్


ఆనంద దేవర కొండ నటన
ఫస్ట్ హాఫ్


మైనస్ పాయింట్స్


కధలో సంఘర్షణ లేకపోవడం
బోరింగ్ స్క్రీన్ ప్లే ,
సెకండ్ హాఫ్ సాగదీత


ఫైనల్ వర్దిక్ట్ : టేకాఫ్ అవ్వని 'విమానం'

ALSO READ: 'పుష్పక విమానం' ఇంగ్లిష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.