మన కథానాయికలంతా బహుముఖ ప్రజ్ఞాశాలులే. నటనే కాదు, మిగిలిన రంగాల్లోనూ ప్రవేశం ఉంది. రాశీఖన్నా అయితే.. కవిత్వం రాస్తుంది. పాటలూ పాడుతుంది. జోరు సినిమాలో ఓ పాట పాడి తనలోని టాలెంట్‌ని బయటపెట్టింది రాశీఖన్నా. ఇప్పుడు మరో పాట కూడా తన ఖాతాలో చేరిపోయింది. అయితే ఈసారి తాను పాడింది తెలుగు పాట కాదు. ఓ మలయాళ గీతం. మోహన్ లాల్ నటిస్తున్న మలయాళ చిత్రం విలన్లో కీలక పాత్ర పోషిస్తోంది రాశీఖన్నా. ఈసినిమా కోసం రాశీ ఓ పాట కూడా పాడేసిందట. మలయాళంలో పాట పాడాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నానని, అది ఇప్పుడు తీరిపోయిందని సంతోషపడిపోతోంది రాశీ. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’, రవితేజతో ‘టచ్ చేసి చూడు’ చిత్రాల్లో నటిస్తోంది రాశీ.