ENGLISH

రాశీఖన్నా నయా అవతార్‌

05 March 2017-12:27 PM

ముద్దుగుమ్మ రాశీఖన్నా హీరోయినే కాదు అంతకు మించిన టాలెంట్‌ ఉంది ఆమెలో అన్న సంగతి చాలా కొద్ది మందికే తెలుసు. నటి మాత్రమే కాదు. ఓ సింగర్‌ కూడా ఈ ముద్దుగుమ్మ. ఈ విషయం తెలిసిందే. ఆల్రెడీ 'జోరు' సినిమాలో ఆమె తన పాటని ప్రేక్షకులకి వినిపించింది. అయితే ఇవే కాదండోయ్‌ అమ్మడిలో ఇంకా చాలా టాలెంట్‌ ఉంది. నిర్మాతగా మారుతోంది రాశి ఖన్నా. మహిళా దినోత్సవం రోజున రాశి ఖన్నా నిర్మాతగా వెరీ వెరీ స్పెషల్‌ ప్రాజెక్ట్‌ ఒకటి అందరి ముందూకూ రానుంది. దీనికి సంబంధించిన మేకింగ్‌ వీడియో విడుదల చేసింది రాశి ఖన్నా. అయితే అది షార్ట్‌ ఫిలిం కావొచ్చునని సమాచారమ్‌. సమీప భవిష్యత్తులో రాశి ఖన్నా నిర్మాతగా ఓ సినిమాని కూడా నిర్మించేస్తుందేమో చూడాలిక. అందాల రాశి ఖన్నాలో ఈ కొత్త టాలెంట్‌, అలాగే ఆమె నయా అవతార్‌ని చూడటానికి అంతా సిద్ధంగా ఉన్నారు. 'బిలీవ్‌ ఇన్‌ యూ' అని మహిళల్లో కొత్త ఉత్సాహం నింపేలా రాశీ ఖన్నా స్పెషల్‌ ప్రాజెక్ట్‌ అందర్నీ అలరించనుందనడంలో ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. రాశి ఖన్నా చేసిన ఈ అనౌన్స్‌మెంట్‌తో ఆమె తెలుగు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈ తరహా ఆలోచనలు కొంతమంది చేసినప్పటికీ అందరి ఆలోచనల్లోకీ రాశి ఖన్నా ఆలోచన చాలా స్పెషల్‌గా ఉంటుందని ఆమె గురించి తెలిసినవారంటున్నారు.

ALSO READ: కూతురికి సంజయ్ దత్ స్వీట్ వార్నింగ్